ఒకరేమో మంత్రి.. మరొక రేమో ఆ శాఖ డైరెక్టర్. కానీ ఇద్దరూ ఒకసారి కూడా కలిసి మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు ఈ ఇద్దరే రాష్ట్రానికి జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే మంత్రి ఒక మాట చెబితే.. డైరెక్టర్ మరో మాట చెబుతున్నారు. వీరిద్దరేమైనా రాజకీయ ప్రత్యర్థులా కాదు కదా. మరెందుకు ఈ తేడా. అంటే అది వారికే తెలియాలి. వారెవరో కాదండి.. ఈటల రాజేందర్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. అసలు రాష్ట్రంలో కరోనా కేసలు చాలా తక్కువ ఉన్నాయి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి చెబుతున్నారు.
కానీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఏమో.. భయంకర పరిస్థితులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటూ హెచ్చరిస్తున్నారు. ఇక ఈయన మాటలపై మొన్న మంత్రి కూడా కాస్త గరం అయ్యారు. మా డైరెక్టర్ జనాలను బాగా భయపెడుతున్నారు. అంత భయంకర పరిస్థితులు ఏం లేవు అంటూ ఈటల రాజేందర్ ఇన్ డైరెక్ట్ గా డైరెక్టర్ కు చురకలు అంటించారు
ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితుల్లో ఏ విషయం చెప్పినా వీరిద్దరే చెప్పాలి. కానీ వీరిద్దరి మధ్య సయోధ్య లేకపోవడంతో.. చెరో మాట చెబుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలు ఎవరి మాట నమ్మాలో అర్థం కావట్లేదు. అయితే ఈటలను బ్లేమ్ చేయడానికే ఇతర మంత్రులు కలిసి హెల్త్ డైరెక్టర్ తో అలా చెప్పిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా వీరిద్దరూ కలిసి కరోనా సంబంధిత జాగ్రత్తలు, సమాచారం చెబితే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు.