ముద్రగడకు రాజ్యసభ పదవి.. జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారా?

-

ముద్రగడ పద్మనాభం.. కాపునేస్తం. ఏపీలో ఈయన పేరు తెలియని వాళ్లు ఉండరు. వంగవీటి రంగా తర్వాత కాపు ఉద్యమ భారాన్ని ఒక్కడే మోశారు. కాపులను బీసీల్లో చేర్చాలని కాపుల్లో బలమైన బీజం నాటారు. టీడీపీ హయాంలో కాపు ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఇందుకు వైసీపీ పూర్తి సహకారం అందించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. అయితే వయో భారంతో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి కాపు ఉద్యమం కాస్త వెనకబడింది. ఉద్యమాన్ని ముందుండి నడిపించే నాయకుడు దొరకలేదు. కానీ కాపు ప్రజల్లో మాత్రం ముద్రగడపై చాలా విశ్వాసం ఉంచింది. కాపు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతోంది. అయితే ముద్రగడ మాత్రం ససేమీరా అంటున్నారు.

కానీ సామాజిక వర్గాలుగా చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు కీలకం కానున్నాయి. మెజార్టీ ఓటర్లు కాపుల్లోనే ఉన్నారు. ఇక కాపు సామాజిక చెందిన పవన్ కల్యాణ్, సోమువీర్రాజు, వంగవీటి రాధాలు వైసీపీతో లేరు. టీడీపీలో వంగవీటి రాధా, బీజేపీలో సోము వీర్రాజు, జనసేనలో పవన్ కల్యాణ్ ఉన్నారు. దీంతో ముద్రగడ మద్దతు కోసం సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభంను ఎలాగైనా సరే తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ముద్రగడ పద్మనాభంకు రాజ్యసభ పదవి ఇస్తే కాపు ఓట్లు ఎక్కువ శాతం వైసీపీకే పడతాయని జగన్ అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ముద్రగడ పద్మనాభంతో ఫోన్‌లో సీఎం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముద్రగడకు రాజ్యసభ పదవి ఇచ్చేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని సమాచారం. త్వరలోనే ముద్రగడ పద్మనాభంను, కాపు కార్యకర్తలను సీఎం జగన్ కలుస్తారనిప్రచారం జరుగుతోంది. వైసీపీలోకి ముద్రగడ వస్తే అటు వంగవీటి రాధా, పవన్, సోము వీర్రాజుకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని వైసీపీ నేతలు, శ్రేణులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version