డ్రగ్స్ కేసులో వైసిపి నేత కుమారుడు ఉన్నాడంటూ అసత్య ప్రచారాలు చేసి చతికిల పడ్డ టిడిపి..

-

హైదరాబాదులోని ఎస్సార్ నగర్ లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది.. అందులో నెల్లూరు జిల్లాకు చెందిన 12 మంది యువకులు ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. ఐతే నెల్లూరుకు చెందిన వైసీపీ ముఖ్య నేత కుమారుడు ఈ కేసులో ఉన్నాడని.. టిడిపి ప్రచారం చేసింది.. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమారుడు డ్రగ్స్ కేసులో ఉన్నాడని ప్రచారం చేసిన నేపథ్యంలో.. నెల్లూరు వైసీపీ ఆఫీసులో ద్వారకానాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. రాజకీయంగా తనని ఎదురుకోలేక తన కుమారుడిపై డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఎస్సార్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన తనిఖీల్లో భాగంగా తన కుమారుడితో పాటు స్నేహితులని విచారణకు మాత్రమే పిలిచారని.. కేసుకి తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని ద్వారకానాథ్ తెలిపారు.. విచారణ జరిపిన పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారని వెల్లడించారు.. డ్రగ్స్ కేసులో తన కుమారుడి ప్రమేయం ఉంటే.. తన కుమారుని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.. తన కుమారుడితో పాటు అతని స్నేహితులకు 12 టెస్టులు నిర్వహించారని అందులో నెగిటివ్ రావడంతోనే తన కుమారుని వదిలేసారని మీడియాకు వివరించారు.. రాజకీయంగా ఎదుగుతున్న తనపై విష ప్రచారాలు చేసినా మౌనంగా ఊరుకున్నానని… కానీ తన కుమారుడిపై అసత్యాల ప్రచారం చేయడం బాదేస్తుందని అన్నారు..

పరువు నష్టం దావా వేస్తా..

డ్రగ్స్ కేసులో తన కుమారుడి ప్రమేయం ఉందంటూ అసత్యాలు ప్రచారం చేసిన వారిపై పరువు నష్ట దావా వేస్తానని ద్వారకనాథ్ హెచ్చరించారు.. త్వరలోనే అందరికీ నోటీసులు వస్తాయన్నారు.. చదువుకుండే స్టూడెంట్స్ పై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే వారి భవిష్యత్తు ఏమవుతుందని ప్రశ్నించారు.. అసత్యాలు ప్రచారం చేసిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ద్వారకానాథ్ హెచ్చరించారు…

Read more RELATED
Recommended to you

Exit mobile version