నాగబాబు vs రోజా – ఇదెక్కడి సోది గోల ?

-

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో లో జడ్జీలుగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు నాగబాబు, రోజా. కలసి షో లు చేస్తూ కలసి నవ్వుకుంటూ రాజకీయ రంగంలో ఉన్నా గాని…టెలివిజన్ రంగంలో కెమెరా ముందుకు వచ్చేసరికి టీవీ చూసే ప్రేక్షకుడికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేవాళ్ళు. ఎక్కడా కూడా రాజకీయాలు తమ మధ్యలోకి రానివ్వకుండా టీవీ ప్రేక్షకులను బాగా అలరించే వాళ్లు.

అటువంటిది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం లో ఇద్దరి మధ్య నాగబాబు vs రోజా అన్నట్లుగా మారిపోయింది. జనసేన పార్టీ తరుపున నాగబాబు అధికార పార్టీ వైసీపీ తరఫున ఎమ్మెల్యే రోజా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇదే తరుణంలో బుల్లితెర లో కూడా జబర్దస్త్ షో నుండి బయటికి వచ్చిన నాగబాబు జీ తెలుగులో ‘అదిరింది’తో జబర్దస్త్ కి పోటీ ఇవ్వటానికి రెడీ అయ్యారు.

 

దీంతో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ అటు రాజకీయంగాను ఇటు బుల్లితెర టెలివిజన్ పరంగాను చాలా గట్టిగా జరుగుతుంది. అంతేకాకుండా ఒకడుగు ముందుకు వేసి నాగబాబు అదిరింది షో తో.. జబర్దస్త్ షో పై పంచులు కౌంటర్లు వేయడంతో అటుపక్క కూడా జబర్దస్త్ షో నుండి ‘అదిరింది’షో పై కూడా కౌంటర్లు పడుతున్నాయి. దీంతో రెండు షో ల మధ్య నువ్వానేనా అన్నట్టుగా వాతావరణం నెలకొంది. అంతే కాకుండా రెండు షో ల మధ్య విమర్శించే వాతావరణం తారాస్థాయికి చేరుకోవడంతో రెండు పార్టీల మధ్య యుద్ధంగా మారిపోయింది. ఈ పరిణామాలతో సోషల్ మీడియాలో వైసీపీ వర్సెస్ జనసేన పార్టీ కార్యకర్తలు నువ్వానేనా అన్నట్టుగా ఒకరి ఫ్యాన్స్ మరొకరిపై మండిపడుతున్నారు. దీంతో టెలివిజన్ ప్రేక్షకులు ఇది ఎక్కడ సోది గోల రా బాబు అంటూ తిట్టుకుంటున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version