ఏపీ మంత్రుల పేషీలపై సీఎంవో నిఘా.. రంగంలోకి సీఎం చంద్రబాబు..

-

ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేవారిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు.. ప్రజలను, నాయకులను ఇబ్బంది పెడుతూ ఉండే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.. ఈ క్రమంలో ఏపీ మంత్రులు పేషీలపై సీఎంవో నిఘా పెట్టింది.. దీంతో మంత్రుల్లో టెన్షన్ మొదలైంది.. ఇప్పటికే హోంమంత్రి అనిత పీఏగా పనిచేస్తున్న జగదీష్ పై అక్రమ వసూళ్లు, అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని విధుల నుంచి తప్పించారు. మిగిలిన మంత్రులు పేషీలపై సీఎంవో ఫోకస్ పెట్టడంతో వారిలో గుబులు మొదలైంది. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే వారిని పక్కనపెట్టాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలిచ్చారట..

వంగలపూడి అనిత పీఏ జగదీష్ పై వేటు పడింది.. అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్స్, అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి.. అనిత వద్ద ప్రయివేట్ పీఏగా జగదీష్ దాదాపు పదేళ్ల నుంచి పనిచేస్తున్నారు. హోంమంత్రిగా అనిత బాద్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు, పోస్టింగులు సిఫార్సు చేయడానికి అక్రమ వసూల్లకు పాల్పడుతున్నారని జగదీష్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.. ఈ వ్యవహారంపై ఏసీ సీఎం సీరియస్ అయ్యారు. అనిత కూడా దీనిపై స్పందించారు.. అక్రమాలకు పాల్పడే వారికి తనదగ్గర చోటు లేదని.. ఆరోపణలు వస్తున్న జగదీష్ ను పక్కనపెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

మరోపక్క మంత్రులు పనితీరు, వారి ప్రయివేట్ పీఏలపై ఇంటెలిజెన్స్ రిపోర్టు సిద్దం చేస్తున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి పేషిపై, గుంటూరుకు చెందిన ఓ మంత్రిపై, కోనసీమకు చెందిన ఓ మంత్రి సిబ్బందిపై ఆరోపణలు వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.. సీఎం చంద్రబాబునాయుడు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సమయంలో టీడీపీలోని ద్వితీయశ్రేణి నాయకుల నుంచి పిర్యాదులు వస్తుండటంతో సీఎం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరికొంత మందిపై వేటు పడే చాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది..

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు కావొస్తోంది.. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రులు పనితీరుపై ఆయన మాట్లాడారు.. ఎవరి పనితీరు ఎలా ఉందనే దానిపై తన వద్ద సమాచారం ఉందని చెప్పారు.. పనితీరు మెరుగు పరుచుకోవాలని కొందరికి పరోక్షంగా వార్నింగులు ఇచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నవారిపై వేటేస్తూ.. నష్టనివారణా చర్యలకు సీఎం చంద్రబాబు దిగారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version