నారాయణపేటలో గొర్ల కాపరిగా పనిచేస్తున్న ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అనుమానాస్పద స్థితిలో ఆ యువకుడు మృతి చెందినట్లు నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. పేరపళ్ళ గ్రామానికి చెందిన గజ్జలి ఆంజనేయులు (16) చదువు మానేసి ఏడాది క్రితం నుంచి తన యజమానికి సంబంధించిన గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో మండలంలోని పేరపల్ల శివారులో మామిడి చెట్టుకుఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ యువకుడి చెప్పుల వాసన ఆధారంగా చూసి ఘటనా స్థలంలో కలియ తిరిగింది. రెండు మూడు చోట్ల మొదట ఆత్మహత్యకు ప్రయత్నించి చివరకు మామిడి చెట్టుకు ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.కాగా, మృతుడు కుటుంబ సభ్యులు స్పందిస్తూ తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు