భూమి మీద మనిషి జీవన మనుగడ ప్రశ్నార్థకంగా మార్చేసింది కరోనా వైరస్. ప్రపంచాన్ని భయపెట్టింది అతిపెద్ద ప్రమాదకరమైన వైరస్ గా చాలా దేశాలలో మరణ విలయతాండవం చేస్తుంది. ఈ వైరస్ వల్ల చాలా మంది ప్రపంచంలో కొన్ని వేల మంది చనిపోగా..లక్షల మంది శరీరాలను తన వశం చేసుకుంది. ప్రపంచంలో ప్రతి మనిషి ఎంతో ప్రభావితం చేసిన ఈ కరోనా వైరస్ నీ క్యాష్ చేసుకోవడానికి కొంతమంది ప్రొడ్యూసర్లు రెడీ అయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కరోనా ప్యార్ హాయ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు.
అపార్ట్ మెంట్ లో ఏడుగురు ఇతర ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో చైనా మూలాలు కలిగిన వ్యక్తి లిఫ్ట్‌లో వైరస్ గురించి మాట్లాడుతున్న సమయంలో జాత్యహంకార ధోరణితో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. తర్వాత ఏం జరిగిందన్నది చాలా వెండితెరపై చూడాల్సిందే అని అంటున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ఏంటి స్వామి ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటే ఈ టైంలో కరోనా మీద సినిమా అంటూ ఆపండి మీ వెర్రి ఐడియాలు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.