కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో టీడీపీ గత మూడు ఎన్నికల్లోనూ ఓటమి లేకుండా గెలుస్తూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి రెండున్నర దశాబ్దాలుగా తిరుగులేని యువనేతగా ఉన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ జగన్ ప్రభంజనం తట్టుకుని గెలిచిన వంశీ ఆ తర్వాత బాబుతో తీవ్రంగా విబేధించి జగన్‌కు జై కొట్టారు. అప్పటి నుంచి వంశీ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారు.
ఇక చంద్రబాబుకు ఇప్పుడు గన్నవరంలో వంశీని ఢీ కొట్టే వ్యక్తిని వెతకడం పెద్ద సవాల్‌గా మారింది. ఆ మాకుట వస్తే బాబు అధికారం లో ఉన్నప్పుడు కూడా గన్నవరం పై ఫోకస్ పెట్టినట్టు కన్పించడం లేదు. వంశీ అడిగిన నిధులు ఇచ్చేందుకు కూడా బాబు పెద్దగా ఇష్టపడలేదన్న టాక్ కూడా ఉంది. అసలు ఈ విషయం వంశీయే చెప్పారు. ఇక ఇప్పుడు వంశీ పార్టీని వీడడంతో పాటు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో బాబుకు అక్కడ కొత్త ఇన్‌చార్జ్‌ను వెతకడం కత్తమీద సాములా మారింది.
ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కోసం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ట్రై చేస్తున్నారు. ఇక రామ్మోహన్ రావు గతంలో ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ గా కూడా గెలిచారు. ఇక మరోనేత, ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ ఈ పదవీ కోసం పోటీ పడుతున్నాడు. గుంటూరు వెస్ట్‌లో ఎమ్మెల్యే మద్దాలి గిరి జగన్‌ను కలిసిన వెంటనే అక్కడ పార్టీ ఇన్‌చార్జ్‌గా కోవెలమూడి రవీంద్రను నియమించిన బాబు గన్నవరం విషయంలో మాత్రం తటపటాయిస్తున్నారు.
ఏదేమైనా వంశీ రెండున్నర దశాబ్దాలుగా గన్నరంలో ఉంటూ ఇప్పటికప్పుడు బాబుకు షాక్ ఇవ్వడంతో బాబుకు ఇప్పుడు అక్కడ ఎవరికి పగ్గాలు అప్పగించి.. పార్టీని ముందుకు నడిపించాలో తెలియక తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి ఆ వచ్చే కొత్త నేత అయినా ఇక్కడ పార్టీని నిలబెడతారో ? లేదో ? చూడాలి.