నిన్న మొన్నటి వరకు ఉదయగిరి టిడిపి టికెట్ తనకే అంటూ ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సైలెంట్ అయ్యారు. ఉదయగిరి అసెంబ్లీ టికెట్టు కాకర్ల సురేష్ కు చంద్రబాబు ప్రకటించడంతో బొల్లినేని వర్గం తీవ్ర సంతృప్తిలో ఉంది.. దీంతో బొల్లినేని రామారావు హైదరాబాద్ వెళ్ళిపోయారు.. రాజకీయాల్లో జూనియర్ గా ఉన్న కాకర్ల సురేష్ కు టికెట్ ఇవ్వడం పై ఉదయగిరి టిడిపి నేతలు చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారట.
2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన బొల్లినేని రామారావు.. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పై గెలుపొందారు.. ఆ సమయంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆయన ఓటమిపాలై ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.. అప్పటినుంచి పార్టీని కనిపెట్టుకొని ఉన్న బొల్లినేని రామారావు.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు..
2024 తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని ఆయన భావించారు.. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ కాకర్ల సురేష్ అనే ఎన్ఆర్ఐ ను ప్రోత్సహించారు.. బొల్లినేని రామారావుకు చెక్ పెట్టేందుకు సురేష్ ను ప్రోత్సహించారని నియోజకవర్గ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో కాకర్ల సురేష్ కు చోటు లభించింది. ఈ వ్యవహారం బొల్లినేని రామారావుతో పాటు ఆయన వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోందట. బొల్లినేనికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా.. ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకుండా కాకర్ల సురేష్ను అభ్యర్థిగా ప్రకటించడంపై ఉదయగిరి టిడిపిలోని నాలుగు మండలాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. బొల్లినేని రామారావు సైతం వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట.. కాకర్ల సురేష్ ను ఎలాగైనా ఓడించాలని.. బొల్లినేని రామారావు భావిస్తున్నారని ఆయన వర్గానికి చెందిన ప్రముఖ నేతలు చెబుతున్నారు.. మరో పది రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గ టిడిపిలో భారీ మార్పులు ఉండబోతున్నాయని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు