చంద్రబాబు డైరక్షన్ లోనే పవన్ పనిచేస్తున్నారు. బాబుకు లోకేష్ పుత్రుడు అయితే..పవన్ దత్తపుత్రుడు అని..బాబు స్క్రిప్ట్‌నే పవన్ ఫాలో అవుతున్నారంటూ వైసీపీ పదే పదే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా విమర్శలు చేయడానికి ప్రధాన కారణం..చంద్రబాబు, పవన్ కలిసి పనిచేసే దిశగా ముందుకెళ్లడం..వారిద్దరు పొత్తు దిశగా వెళుతున్నారు. ఇక పొత్తులో వెళితే వైసీపీకి కాస్త ఇబ్బందే. అందుకే పవన్‌ని ఏదొక విధంగా రెచ్చగొట్టి పొత్తు లేకుండా చేయాలనేది ప్లాన్.
కానీ ఎంత ప్లాన్ చేసిన బాబు, పవన్ మాత్రం కలిసే ముందుకెళుతున్నారని తెలుస్తుంది. అధికారికంగా పొత్తు ఫిక్స్ చేసుకోలేదు..కానీ అనధికారికంగా వారు కలిసే ఉన్నారు. ఎన్నికల ముందే పొత్తుపై ప్రకటన చేస్తారు. ఇక వారు కలిసే పనిచేస్తున్నారని తెలిసిపోతుంది. ఎందుకంటే బాబు, పవన్ మధ్య అండర్‌స్టాండింగ్ గట్టిగానే ఉంది. ఇటీవల వారాహి యాత్రతో పవన్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్క మాట అనడం లేదు.
అంతకముందు పవన్..వివేకా హత్య కేసు గురించి పెద్దగా మాట్లాడేవారు కాదు..ఇప్పుడు బాబు మాదిరిగా ప్రతి సభలో వివేకా హత్య కేసు ప్రస్తావిస్తున్నారు..ఇసుక దోపిడి, గంజాయి..ఇలా టిడిపి చేసే విమర్శలే పవన్ చేస్తున్నారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే..పవన్ ప్రజల్లో ఉంటే బాబు ఉండటం లేదు.
పవన్ పర్యటన ముందు వరకు బాబు నియోజకవర్గాల పర్యటనలు చేశారు. రోడ్ షోలు, సభల్లో పాల్గొన్నారు. ఎప్పుడైతే పవన్ టూర్ మొదలైందో..అప్పుడు బాబు సైలెంట్ అయ్యారు. పార్టీ పరమైన కార్యక్రమాలే చూసుకుంటున్నారు. అంటే ఇద్దరు ఒక్కటే కాబట్టి..ఎవరో ఒకరే ప్రజల్లో ఉంటే స్పందన గట్టిగా వస్తుందని, మీడియా కవరేజ్ జరుగుతుందని, అదే ఇద్దరు ఒకేసారి వెళితే మీడియా కవరేజ్ ఇబ్బంది..అలాగే చర్చ కూడా మారుతుంది. కాబట్టి పవన్ టూర్ తో బాబు సైలెంట్ అయ్యారు. మళ్ళీ పవన్ టూర్ అవ్వగానే బాబు లైన్ లోకి వస్తారు. ఇదే వీరి స్కెచ్.