బీజేపీ ప్రవర్తనపై పవన్ గుస్సా .. బ్యాక్ గ్రౌండ్ లో జరిగింది ఇదే !

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు. పార్టీ పెట్టిన ప్రారంభంలో మంచి దూకుడుగా కనిపించిన గాని ఆ తర్వాత మెల్లమెల్లగా నీరుగారిపోయారు. 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసి రెండు చోట్ల చాలా ఘోరంగా ఓటమి చెందడం జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి వెళ్లి పోతారు అనుకున్నా గానీ అనూహ్యంగా బిజెపి పార్టీతో చేతులు కలిపి సరికొత్త రాజకీయానికి తెర లేపారు. మొదటి నుండి పవన్ కళ్యాణ్ వైయస్ జగన్ ని టార్గెట్ గా చేసుకుని చాలా స్ట్రాటజీ లు వెయ్యడం జరిగింది. ఎన్నికలలో ఓడిపోయిన గాని జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న గాని ఎక్కడా తగ్గలేదు పవన్. దీంతో తనకు కేంద్రం బలం కూడా తోడైతే జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చని భావించి బీజేపీతో కలసి పని చేయడానికి పవన్ చేతులు కలిపారు. అయితే ఈలోపు కరోనా వైరస్ రావటంతో చాలావరకు బిజెపి…జగన్ యొక్క విధి విధానాలను అనుసరిస్తూ ఉండటంతో బీజేపీ ప్రవర్తనపై పవన్ కళ్యాణ్ గుస్సా గా ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్. అంతే కాకుండా స్వయంగా బీజేపీ నాయకులు జగన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా మీడియా ముందు పొగడటానికి కూడా పవన్ కళ్యాణ్ సహించలేక పోతున్నట్లు వార్తలు  వస్తున్నాయి. ఇటీవల గుజరాత్ లో చిక్కుకుపోయిన మత్స్యకారులను అక్కడి ప్రభుత్వం తిరిగి రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఈ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా సాక్షిగా కేంద్ర ప్రభుత్వానికి గుజరాత్ సర్కార్ కి తన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

 

మరోపక్క గుజరాత్ సర్కారు మాత్రం వైయస్ జగన్ అనుసరించిన విధానాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా జగన్ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మొత్తం పరిణామాలతో పవన్ కళ్యాణ్ బిజెపి నాయకులతో అంతర్గతంగా చర్చించినట్లు సమాచారం. నేను మీతో చేతులు కలిపి బీజేపీని పొగుడుతుంటే…మీరు వ్యవహరిస్తున్న తీరు నా పొలిటికల్ కెరీర్ ని డ్యామేజ్ చేసే విధంగా ఉందని అన్నట్లు టాక్. మరోపక్క కలిసి పని చేద్దాం అని చెప్పి ఇష్టానుసారంగా నిర్ణయలు తీసుకోవడం పట్ల కూడా అంతర్గత బ్యాక్ గ్రౌండ్ లో బిజెపి నాయకులను పవన్ కళ్యాణ్ నిలదీసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే బీజేపీ వ్యవహారశైలి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నట్లు చేసే విధంగా ఉన్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version