జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు నాలుకల దోరణి ఆయనకు పొలిటికల్ కష్టాలు తెచ్చిపెడుతుంది. గతంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో కర్నూలు హైకోర్టు రావాలని కర్నూల్ ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో పవన్ ప్రసంగించడం జరిగింది. జనసేన అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాగా ఆ తర్వాత వైసిపి పార్టీ గెలవడం మరియు జగన్ ముఖ్యమంత్రి అవడం తో అన్ని లెక్కలు ఒక్కసారిగా తారుమారు అయ్యాయి.
అంతేకాకుండా పవన్ వ్యవహారం పట్ల అసహ్యం కూడా కొంతమంది చెందినట్లు వార్తలు వచ్చాయి. దీంతో తమ ప్రాంతాల అభివృద్ధికి అడ్డుపడుతున్న నాయకులకు ఇటీవల ఉత్తరాంధ్ర వాసులు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. దీనిలో భాగంగా విశాఖపట్నం విమానాశ్రయం బయట చంద్రబాబుకి చుక్కలు చూపించారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రాంతం వైపు కనిపించకుండా..జగన్ విశాఖలో రాజధాని ఏర్పాటు చేశాక అప్పుడు ఆ ప్రాంతంలో అడుగు పెడితే బాగుంటుంది అన్నా ఆలోచనలో ఉన్నారట. దీంతో విశాఖ పట్టణంలో ఉన్న జనసైనికులు అబ్బో ఇప్పట్లో పవన్ కల్యాణ్ కానిపించడు అంట కదా అంటూ తెగ చర్చించుకుంటున్నారు.