టార్గెట్ పెద్దిరెడ్డి… బాబుకు కష్టమేనా!

-

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ ప్రత్యర్ధి జగన్ అనే సంగతి అందరికీ తెలిసిందే..ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బాబు-జగన్ ల మధ్యే వార్ నడుస్తోంది. అలాగే జగన్ కు చెక్ పెట్టి ఈ సారి అధికారం దక్కించుకోవాలని బాబు పోరాడుతున్నారు. అయితే బాబు జగన్ పై ఏ స్థాయిలో పోరాడుతున్నారో అందరికీ తెలిసిందే. ఇక ఇదంతా పైకి కనిపిస్తున్న రాజకీయం…కానీ బాబు కనబడకుండా తన చిరకాల ప్రత్యర్ధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎక్కువ పోరాడుతున్నట్లు తెలుస్తోంది.

జగన్ వల్ల కంటే పెద్దిరెడ్డి వల్లే బాబుకు ఎక్కువ ఫ్రస్టేషన్ వస్తుందని చెప్పొచ్చు…ఎందుకంటే పెద్దిరెడ్డి చేస్తున్న రాజకీయానికి చంద్రబాబుకు చుక్కలు కనబడుతున్నాయని చెప్పొచ్చు…తన సొంత జిల్లా చిత్తూరులోనే బాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అధినేత అయిన..తమ సొంత జిల్లాల్లో సత్తా చాటుతారు. జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ ఏ విధంగా సత్తా చాటుతుందో చెప్పాల్సిన పని లేదు.

కానీ బాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వైసీపీ సత్తా చాటుతుంది…దీనికి కారణం అదే జిల్లాలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పొచ్చు. ఆయన జిల్లా రాజకీయాలని పూర్తిగా మార్చేసి…వైసీపీకి అనుకూలంగా నడిచేలా చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ 13 సీట్లు గెలుచుకుందంటే…దానికి కారణం పెద్దిరెడ్డి వ్యూహాలే అని చెప్పొచ్చు. కేవలం కుప్పంలో మాత్రం బాబు గెలిచారు. ఇక ఇప్పుడు ఆ కుప్పంని సైతం బాబుకు దూరం చేసేలా ఉన్నారు. ఇప్పటికే లోకల్ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ పాగా వేసింది..సాధారణ ఎన్నికల్లో బాబుకు చెక్ పెట్టి కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయాలని పెద్దిరెడ్డి చూస్తున్నారు.

ఇలా రాజకీయంగా దెబ్బకొడుతున్న పెద్దిరెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలని బాబు చూస్తున్నారు…ఇప్పటికే పెద్దిరెడ్డి సొంత స్థానం పుంగనూరుపై ఫోకస్ చేశారు..అలాగే జిల్లాలో పెద్దిరెడ్డి వ్యూహాలు వర్కౌట్ కాకుండా చేయాలని చూస్తున్నారు. అయితే బాబు ఎంత ట్రై చేసిన పెద్దిరెడ్డిని నిలువరించడం కష్టమనే తెలుస్తోంది…ఎందుకంటే రూట్ లెవెల్ లో పెద్దిరెడ్డి వ్యూహాలు అమలు అవుతున్నాయి. దీని బట్టి చూస్తే ఈ సారి కూడా చిత్తూరులో పెద్దిరెడ్డి పైచేయి సాధించేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version