ఓ మంత్రి.. ఓ ఎమ్మెల్యే.. మధ్యలో బూడిద

-

కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ‌కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ ఒక రేంజ్ లో కొనసాగుతుంది. రెండు నెలలు నుండి జరుగుతున్న ఈ ఆరోపణలు చివరికి కేసుల వరకి వెళ్ళాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పైనా ఎన్టీపీసీలోని ఫ్లై యాష్ రవాణాలో అవినీతి జరిగందంటూ ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే. పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయంటూ పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.అయితే ప్రబాకర్ ఈ అవినీతి అరోపణలపై ఎక్కడా స్పందించలేదు సరికదా కాంగ్రెస్ నేతలు కౌశిక్‌కు కౌంటర్ ఇచ్చారు.దీంతో అక్కడి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి కౌశిక్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా మొన్న జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో తాను ఏంఈవోలతో సమావేశం నిర్వహించిన కారణంగా వారికి నోటీసులు ఇవ్వడం అన్యాయం అంటూ కౌన్సిల్ హాల్‌లో బైఠాయించారు కౌశిక్ రెడ్డి. అంతే కాకుండా కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులపైనా అగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేదిక ముందు కలెక్టర్‌ను అడ్డుకుని నిలదీశారు.

డీఈవోను సస్పెండ్ చేయాలంటూ నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే విధులకు ఆటంకం కలిగించారంటూ జెడ్పీ సీఈవో శ్రీనివాస్ పోలిసులకు ఫిర్యాదు చెశారు.తరువాత కౌశిక్ జెడ్పీ సీఈవో శ్రీనివాస్ పైనా పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన మీద అక్రమ కేసులు పెట్టించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాత్ర ఉందంటూ మరోసారి విమర్శలు గుప్పించారు కౌశిక్ రెడ్డి.

మొత్తానికి ఈ ఇద్దరు నేతల మధ్య ప్రస్తుతం బూడిద యుద్ధం నడుస్తోంది.కౌశిక్ మాత్రం తగ్గేదీ లేదంటుoడగా కాంగ్రెస్ శ్రేణులు ‌కౌశిక్ వీర లెవెల్లో నటిస్తున్నారని,దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారు.ఫ్లైయాష్ రవాణాలో మంత్రి పొన్నంకు ఎక్కువ వాటా ఉందని కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణ.స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు వాటా తగ్గిస్తున్నారనేది కౌశిక్ రెడ్డి ఆవేదన.అక్కడ బెడిసికొట్టిన వాటాల వివాదం ఇక్కడి దాకా వచ్చింది.అయితే చివరికి ఈ బూడిద రాజకీయం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version