వందరోజుల్లోనే ఆ వర్గంలో కూటమిపై వ్యతిరేకత.. భవిష్యత్ లో ఇబ్బంది తప్పదంటున్న క్యాడర్..

-

ఏపీ చరిత్రలో కూటమి పార్టీలు రికార్డు సృష్టించాయి.. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని.. అధికార పీఠాన్ని దక్కించుకున్నాయి.. అన్నివర్గాల ప్రజలు కూడా మద్దతు ప్రకటించారు.. అందరి ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తోందని ప్రజలు భావించారు.. కానీ వందరోజుల్లోనే ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత స్టాట్ అయింది.. ఇచ్చిన హామీలను అమలుచెయ్యకపోగా.. ఉన్న ఉపాధిని కూడా తీసెయ్యడంతో యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు..

కేవలం వందరోజుల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేక సెగ తగులుతోంది.. ముఖ్యంగా టీడీపీకి మెజార్టీ ఓటింగ్ ఉన్న యువ‌త నుంచి భారీ వ్య‌తిరేక‌త పెరుగుతోంది.. ఇది ఎవరో అంటున్నదికాదు.. స్వంత పార్టీ నేతలే.. ప్రచారం చేస్తున్నారు.. ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. దానిపై ఇప్పటివ‌ర‌కు స్పష్టత ఇవ్వలేదు.. పవన్ కళ్యాణ్ అస్సలు రాజకీయాల గురించే పట్టించుకోవడంలేదు.. రాష్ట వ్యాప్తంగా ఉన్న సుమారు వాలంటీర్లు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.. రోజూ నిరసనలు కూడా చేస్తున్నారు..

వాలంటీర్ వ్యవస్థ ఆగ్రహావేశాలు ఓ వైపు ఉంటే.. మరో వైపు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ప్రభుత్వతీరుపై మండిపడుతున్నారు.. మద్యాన్ని చంద్రబాబు ప్రయివేట్ పరం చేశారు.. అందులో పనిచేసే ఉద్యోగుల గురించి ఆయన ఇప్పటి వరకు ప్రస్తావించలేదు.. గ‌త ఐదేళ్లుగా ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో ప‌నిచేస్తున్న 60 వేల మంది ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నా.. ఆ దిశగా ఒక స్టేట్మెంట్ కూడా లేకపోవడంతో.. వారంతా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న పరిస్తితి కనిపిస్తోంది..

అలాగే రేషన్ ను ఇంటింటికి అందించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాలకు మంగళం పాడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. దీంతో వాటి మీద ఆధారపడి బతుకుతున్న 67 వేల మంది డ్రైవ‌ర్లు, మ‌రో 67 వేల మందికి పైగా స‌హాయ‌కుల పరిస్తితి అగమ్యగోచరంగా మారింది.. ఇలా టీడీపీ, జనసేనకు ఓటుబ్యాంకు గా ఉన్న యువతే కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని.. పార్టీలో చర్చ నడుస్తోంది.. వీరికి చంద్రబాబు ప్రత్యామ్నాయం చూపుతారో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version