పవన్ గెలిస్తే సీఎం అవుతాడు.. ఓడితే సీఎంకు మొగుడవుతాడు: వర్మ

-

అబ్బబ్బ.. ఏమన్న డైలాగా? అద్భుతంగా ఉంది కదా. ఈ డైలాగ్ వేసింది ఎవరో తెలుసా? రామ్ గోపాల్ వర్మ.. అవును.. ఆయనే. తన పేస్ బుక్ లో పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.

బ్రహ్మంగారు నాకు చెవిలో చెప్పింది… పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏపీ సీఎం అవుతాడు.. గెలవకపోతే గెలిచిన సీఎంకు మొగుడవుతాడు.. తధాస్తు.. అంటూ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు ఆర్జీవీ.

ఆ తర్వాత మరో పోస్ట్ కూడా చేశాడు.. సీబీఎన్.. పీకేను వాడుకుని అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచినందుకు ప్రతీకారంగా రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన నైజములో ఉన్న నిజాయితీతో నారా చంద్రబాబు నాయుడును ముందుపోటు పొడుస్తాడని పీకే పవర్ మీద నా అత్యంత మెగా నమ్మకం.. అంటూ పోస్ట్ చేశాడు వర్మ.

అయితే.. వర్మ పోస్టులపై పవన్ కళ్యాణ్ అభిమానులు వెంటనే స్పందించారు. అబ్బో.. ఆర్జీవీకి పవన్ కళ్యాణ్ మీద తెగ ప్రేమ పుట్టుకొస్తుంది. దేనికో.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కోసమా ఈ కష్టాలు.. అంటూ జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మకు కౌంటర్లు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version