నాని బుక్కయ్యాడుగా..!

-

నాని, విక్రం కుమార్ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ బ్యానర్ లో వస్తున్న సినిమాకు గ్యాంగ్ లీడర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. నిన్న నాని బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటుగా చిన్న టీజర్ కూడా వదిలారు. ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్ కు లీడర్ గా నాని కనిపిస్తాడని తెలుస్తుంది. అంతా బాగానే ఉంది కాని ఈ సినిమాకు గ్యాంగ్ లీడర్ అని టైటిల్ పెట్టడం దగ్గరే వచ్చింది అసలు చిక్కు.

ఆ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ బొమ్మ ఒకటి ఉంది. ఇక ఆ టైటిల్ మళ్లీ వాడి కనుక రాం చరణ్ వాడాలని మెగా ఫ్యాన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. సడెన్ గా నాని వచ్చి నేను గ్యాంగ్ లీడర్ అనేశాడు. ఈ టైటిల్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నాని టీం లీడర్, గ్రూప్ లీడర్ ఇలాంటి టైటిల్ పెట్టుకో కాని గ్యాంగ్ లీడర్ మాత్రం వద్దని చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ చిరంజీవి ప్రమేయం లేకుండా ఇలా చేస్తారా అన్న డౌట్ మొదలైంది. అసలే బిగ్ బాస్ ముందుదాకా క్లీన్ ఇమేజ్ ఉన్న నాని ఆఫ్టర్ బిగ్ బాస్ కొద్దిగా నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ టైటిల్ తో మెగా ఫ్యాన్స్ కు దూరమవుతున్నాడు నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version