వేములవాడ దేవాలయం అభివృద్ధికి రూ.50 కోట్లు ; తెలంగాణ మంత్రి

-

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న ఆలయానికి వీటిడీఏ నుండి ఇప్పటి వరకు 100 కోట్లు పెట్టామని.. త్వరలో మరో 50 కోట్లు బడ్జెట్ లో పెడుతున్నామన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఐకె రెడ్డి. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని..అందుకే 30 ఎకరాల ల్యాండ్ ను ప్రైవేట్ నుండి తీసుకున్నారని తెలిపారు. ఇవాళ వేములవాడలో దేవాదాయ శాఖ మంత్రి ఐకె రెడ్డి పర్యటించారు.

Minister Indra Karan Reddy

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో నే పవిత్రమైన ఆలయం రాజన్న ఆలయమని.. వేములవాడ రాజన్న ఆలయం సామాన్యులకు అండగా ఉందన్నారు. రాష్ట్రంలో నే ఎక్కువ భక్తులు వచ్చేది వేములవాడ రాజన్న ఆలయానికని.. యాదాద్రి తర్వాత రాజన్న ఆలయం పూర్తి స్థాయిలో అభివృధ్ధి జరుగుతుందని తెలిపారు. భక్తులకు రూమ్స్ కొరత ఉండడంతో కొత్తగా 60 వసతి గదులు నిర్మించామని వివరించారు. కరోనా సమయంలో సైతం రాజన్న ఆలయానికి వేలాది మంది వస్తున్నారని.. కేటిఆర్ జిల్లా ను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. కరోనా కారణం గా కొత్త ఆదాయం తగ్గింది అయిన సంక్షేమ మాత్రం జరుగుతుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version