శేరిలింగంపల్లిలో గాంధీని ఢీకొట్టేది ఎవరు?

-

శేరిలింగంపల్లి ఈ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాదులో ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట, కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి అరికెపూడి గాంధీ గెలిచి..నెక్స్ట్ బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. 2018లో మళ్ళీ ఆయనే బి‌ఆర్‌ఎస్ నుంచి గెలిచారు. అయితే ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కాంగ్రెస్ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ ప్రాంతం లో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఇక్కడి నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా అరికపూడి  గాంధీని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ మాత్రం తన అభ్యర్థి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఎవరి పేరు ప్రకటించలేదు. ఎప్పటినుండో పార్టీలో ఉన్న సత్యంరావుకు టికెట్ ఇస్తారా, కొత్తగా వచ్చిన రఘునాధరావుకి టికెట్ ఇస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని వర్గాలలో అరికెపూడి గాంధీని తట్టుకోవాలంటే అంగ బలం, అర్థబలం ఎక్కువగా ఉన్న నాయకుడు కావాలి. అలాంటి  నాయకుడి కోసం కాంగ్రెస్ వెతుకుతోంది.

సత్యం రావుకు ఢిల్లీలో నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీలో చక్రం తిప్పైనా సత్యం రావు టికెట్ తెచ్చుకుంటాడు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రఘునాధరావుకు పొంగులేటి అనుచరుడుగా పేరు ఉంది. పొంగులేటి రికమండేషన్ తో రఘునాధరావుకు టికెట్ ఇస్తారా లేదా అనే సందేహం నేతలకు ఉంది. సత్యం రావుకు వివాదరహితుడని పేరు ఉంది. ఇన్ని రోజులు తెరవెనక ఉండే రాజకీయాలు నడిపారు తప్ప ఇతనికి ప్రజలలో పట్టు తక్కువ ఉంది. కానీ అభ్యర్థిగా తనని ప్రకటిస్తారని వార్తలు వచ్చిన దగ్గర నుంచి తనకంటూ కేడర్ ను ఏర్పరచుకొని నియోజకవర్గంలో పట్టు సంపాదించారు.

రఘునాద రావు పార్టీలో కొత్తగా చేరడంతో నియోజకవర్గంలో అప్పటికప్పుడు పట్టు సాధించడం కష్టం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బండి రమేష్ ఇన్ని రోజులు పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ పెద్దలు శేరిలింగంపల్లి స్థానానికి అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు .కానీ ఇప్పుడు బండి రమేష్ రాకపోవడంతో హస్తం ఆశలన్నీ సత్యం రావు పైనే అని రాజకీయ వర్గాలు అంటున్నారు. మరి శేరిలింగంపల్లిలో హస్తం హవా కొనసాగించే వారెవరో సీనియర్ సత్యం రావా??? జూనియర్ రఘునందన్ రావు??జాబితా విడుదల అయ్యేవరకు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version