హరీష్ రావు చేసిన పనికి సెల్యూట్ అంటున్న సిద్ధిపేట…!

-

తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి, తెరాస కీలక నేత హరీష్ రావు వ్యక్తిత్వం కాస్త భిన్నంగా ఉంటుంది. ఉద్యమ నాయకుడు అయినా, ఆ తర్వాత ఎమ్మెల్యే అయినా సరే ఆయన ప్రజల్లోనే ఎక్కువగా ఉంటారు. ఆయన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో చాలా మంది ప్రజలను పేరు పెట్టి పిలిచే సత్తా ఉన్న నాయకుడు ఆయన. మంత్రి అయినా సరే తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయినా తెలంగాణా లో అయినా సరే ఆయన గెలుపు ఒక సంచలనం. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఆదివారం సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆయన, సోమవారం ఉదయం తన నియోజకవర్గం సిద్ధిపేటలో ప్రత్యక్షం అయ్యారు. సిద్ధిపేటలోని 33, 34 మున్సిపల్ వార్డుల్లో తిరిగిన ఆయన… వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. పట్టణంలో మార్నింగ్ వాక్‌కి వెళ్ళారు హరీష్.

అక్కడ ఇంటింటికీ తిరిగారు. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి ఇవ్వాలని 5 మున్సిపల్ వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించారు వారితో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్ చెయ్యవచ్చనీ, అందువల్ల తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ఉంచాలని సూచించారు. దీనితో అక్కడి ప్రజలు షాక్ అయ్యారు. మంత్రి ఇలా స్వయంగా ఇంటికి రావడంతో ప్రజలు ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version