టీడీపీకి వంద సీట్లు..మరో లగడపాటి రెడీ.!

-

ఏపీ రాజకీయాలపై విశ్లేషణలు ఇచ్చే విశ్లేషకులు ఎక్కువైపోయారు..అక్కడ రాజకీయాలలో ప్రధాన పార్టీలకు అనుకూలంగా విశ్లేషకులు కూడా తయారయ్యారు. ఎవరికి నచ్చిన పార్టీకి వారు మద్ధతు ఇస్తూ..ఆ పార్టీకి తిరుగుండదని నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తుందని చెబుతున్నారు. అటు వైసీపీకి, ఇటు టీడీపీకి సైతం అదే తరహాలో సొంత విశ్లేషకులు తయారయ్యారు. ఎవరికి వారు నచ్చిన విధంగా విశ్లేషణలు చేస్తున్నారు.

ఇదే క్రమంలో తెలంగాణకు చెందిన నేత గోనె ప్రకాశ్ రావు..ఏపీ రాజకీయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. గతంలో ఈయన కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో పనిచేశారు. ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు..కానీ ఏపీలో టి‌డి‌పికి అనుకూలంగా విశ్లేషణలు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఏపీ రాజకీయాలపై స్పందించారు.  టీడీపీ- జనసేన కలిస్తే 151 సీట్లు దాటుతాయని.. విడిగా పోటీ చేసినా టీడీపీకి 100 సీట్లు దాటుతాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. అలాగే కొందరు విశ్లేషకులు డబ్బులు తీసుకుని  సర్వేలు చెబుతున్నారని మండిపడ్డారు.

మరి ఈయన చాలా కాలం నుంచి టి‌డి‌పికి అనుకూలంగానే విశ్లేషణలు ఇస్తున్నారు. ఇక ఈయనకు టి‌డి‌పి నుంచి ఎంత డబ్బులు వచ్చాయని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో లగడపాటి రాజగోపాల్ అలాగే టి‌డి‌పికి అనుకూలంగా సర్వేలు చేసి చెప్పారని, కానీ ఆయన ఇప్పుడు ఏం అయ్యారో అందరికీ తెలుసని, ఇటీవల వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం అదే తరహాలో టి‌డి‌పికి అనుకూలంగా ముందుకెళుతున్నారని, ఇప్పుడు గోనె అదే పనిలో ఉన్నారని, మరి వీరి విశ్లేషణలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version