చంద్రబాబు ముందు అగ్ని పరీక్ష పెట్టిన జగన్…!

-

నమ్మిన వాళ్ళు వరుసగా షాక్ లు ఇస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీకి పెద్ద దిక్కు అనుకున్న వారు అందరూ జై జగన్ అంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు, ఇలా ఒకరి తర్వాత ఒకరు పార్టీ మారడానికి సిద్దమయ్యారు. రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి తగులుతున్న దెబ్బలు ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితి చంద్రబాబుది. నిన్న ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను అండగా ఉంటాను అని వారికి హామీ ఇచ్చారు. అయినా సరే గొట్టిపాటి రవి కుమార్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ని కలిసారు.

టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, ప్రజా ప్రతినిధుల మీద జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి వరుసగా కొందరు టీడీపీ నేతలకు ఫోన్లు కూడా చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం స్థానిక నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా అసంతృప్తిగా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద చంద్రబాబు ఆరా తీయడం మొదలుపెట్టారు.

గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారని, శ్రీకాకుళం జిల్లాలో బెందాలం అశోక్ కూడా పార్టీ మారడానికి సిద్దమయ్యారు. ఆయనతో పాటుగా మరికొందరు నేతలు లైన్లో ఉన్నారు. దీనితో చంద్రబాబు నాయుడు లో అలజడి మొదలైందని అంటున్నారు, ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఎప్పుడు పార్టీ మారతారో చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version