టీడీపీ మహానాడు 2020లో సుమారు 13 తీర్మానాలు చేయగా, వాటిపై సుమారు 39మంది వక్తలు ప్రసంగించనున్నారు! ఆ తీర్మానాలు అన్నీ ఆత్మస్తుతి పరనింద పద్దతిలోనే ఉన్నాయన్న విషయం కాసేపు పక్కన పెడితే… ఈ తీర్మానాల్లో ఒక ప్రధానమైన తీర్మానం… దూరమైన వర్గాలను దరి చేర్చుకోవడం! అవును… 2014 ఎన్నికల సమయంలో బాబు అనుభవంపై నమ్మకం పెట్టుకున్న ఏపీ ప్రజలకు బాబు రుచిచూపించిన తన పాలన ఫలితంగా 2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బ మామూలుది కాదు! అందుకు కారణం… టీడీపీకి చాలా కాలంగా దగ్గరగా ఉంటున్న వర్గాలు అన్నీ దూరమవ్వడమే అని నమ్ముతున్న బాబు అండ్ కో… ఆ అంశంపై చర్చించాలని తీర్మానించింది! ఇక్కడ చిత్రం ఏమిటంటే… ఆ తీర్మానంపై ప్రసంగించేది రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్ అంట!
అవును… నేడో రేపో పార్టీని వీడుతున్నారనే వార్తలు వస్తోన్న తరుణంలో… పార్టీకి దూరమైన వర్గాలను ఎలా దగ్గర చేసుకోవాలన్నే అంశంపై ప్రసంగించడానికి టీడీపీ… రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్ ను ఎంపిక చేసింది! ప్రస్తుతం ఇదే మహానాడులో హైలైట్ అయ్యే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు! అయితే అసలు సత్యప్రసాద్ ఈ వేడుకలకు ఆన్ లైన్ లో హాజరవుతారా అన్నది ఒక ప్రశ్న అయితే… అసలు ఈ అంశంపై ఏమి మాట్లాడతారు అనేది మరో భారీ ప్రశ్న! ఈ సందర్భంలో “గత సంవత్సరకాలంగా ప్రతిపక్ష పాత్రలో టీడీపీ పాత్ర” అనే అంశంపై ఈ ఎమ్మెల్యేకి అవకాశం ఇస్తే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడటం ఈ సందర్భంగా కొసమెరుపు!
కాగా… మంగళవారం అంతా ఏపీ రాజకీయ వర్గాల్లో జరిగిన రాజకీయ చర్చల్లో కీలకంగా మారిన అంశం… టీడీపీ ఎమ్మెల్యేలు వైకాపాలో చేరే క్రమంలో జగన్ ను కలుస్తున్నారని! మహానాడు వేడుకల సమయంలో బాబు కు వైకాపా సిద్ధం చేసిన బహుమతి ఇదేనని కథనాలు వచ్చాయి! అయితే ఆ కథానలకు సంబందించి బుధ, గురువారాలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!