పార్టీని డ్యామేజ్ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. యాక్షన్ ఉంటుందా..

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్లు క్షేత్రస్థాయిలో రెచ్చిపోతున్నారు.. తమకు అడ్డొచ్చే వారే లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.. ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో వెళ్తుండడం పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రాగానే కొందరు ఇసుక అక్రమ రవాణా పై దృష్టి పెట్టారు.. ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెలుసుకున్న చంద్రబాబు వారికి వార్నింగ్ ఇచ్చారు.. అంతా సెట్ రైట్ అయింది అనుకున్న సమయంలో.. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.. పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తించొద్దు అంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది మాత్రం మాట వినడం లేదు..

ఈ క్రమంలో పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చారంటూ సత్యవేడు ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు.. ఈలోపే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా నోటికి పని చెప్పారు. లోకేష్ తరహాలో తన వద్ద రెడ్ బుక్ ఉందని.. అందులో వంద మంది పేర్లు ఉన్నాయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. లోకేష్ రెడ్ బుక్కుతో చంద్రబాబు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారట.. ఈ సమయంలో భూమా అఖిల ప్రియ కూడా రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడంతో.. చంద్రబాబు సీరియస్ అయ్యారని పార్టీలో ప్రచారం నడుస్తోంది.. అఖిలప్రియ వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు పార్టీని అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారనే టాక్ ఆమె ప్రత్యర్థులు నుంచి వినిపిస్తోంది..

మరోపక్క ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి ఇబ్బందిగా ఉందని పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారు. పార్టీ క్యాడర్ తో పాటు, మహిళలను కూడా ఆయన అవహేళనగా మాట్లాడుతున్నారంటూ బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి.. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యేలు.. ఈ తరహా ప్రవర్తనతో పార్టీకి డ్యామేజ్ తీసుకొచ్చేలా ఉన్నారంటూ సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.. వీటన్నిటినీ చంద్రబాబు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version