రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తీవ్ర విమర్శలు చేసారు. బీసీల గురించి మాట్లాడే అర్హత సిఎం వైఎస్ జగన్ కు లేదు అని అంగర ఆరోపణలు చేసారు. బీసీ కార్పొరేషన్లకు నిధులు లేవు, చైర్మన్లు కూర్చోవడానికి కుర్చీలు లేవు అని ఆయన మండిపడ్డారు. బీసీల సంక్షేమానికి పాటుబడిన ఘనత, రాజ్యార్హత కల్పించింది టీడీపీ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేసారు.
ఈ సందర్భంగా మంత్రులపై కూడా ఆయన విమర్శలు చేసారు. బీసీ మంత్రులు తమ జిల్లాలకే పరిమితం అయ్యారు అని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా తిరిగే పరిస్థితి లేదు అని ఆయన ఎద్దేవా చేసారు. బీసీలకు అన్యాయం చేస్తే జగన్ కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు అని మండిపడ్డారు. ఇటీవల బీసీ కార్పోరేషన్ లు ప్రకటించి పదవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.