వైసీపీ ప్రతి స్కీం అవినీతి మయమే: టీడీపీ ఎంపీ

-

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉంది. మరో అయిదు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ నేతలు గెలుపుపై తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రజల కోసం తీసుకువచ్చాము స్కీం లు అని చెప్పుకుంటూనే, ప్రతి స్కీం లోనూ అవినీతిని చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి స్కీం కూడా ఒక స్కాం అంటూ వైసీపీని అవమానించారు కనకమేడల. ఆఖరికి చిన్న పిల్లలకు ఇచ్చే చిక్కీ లోనూ అవిఏఎంతి చేశారంటూ వైసీపీపై ఆరోపణలు చేశారు కనకమేడల. వైసీపీ ప్రభుత్వం పాలనలో భాగం అయిన అప్పులు, ఆదాయాలు, అభివృద్ధి మరియు సంక్షేమం పై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

ఇక రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ పక్షాన నిలబడి అధికారాన్ని వైసీపీకి దూరం చేస్తారని కనకమేడల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఒకటిన్నర నెల అవుతున్నా ఇంకా రిమాండ్ లోనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version