గత ఎన్నికల్లో మూడు పార్టీలు ఏకమై పోటీ చేశాయి.. జగన్మోహన్ రెడ్డిని ఓడించి.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.. 11 స్థానాలకే పరిమితమైన జగన్.. ఇక కోలుకోవడం అసంభవమని.. వైసీపీ భూస్థాపితం అయిందని ప్రగల్బాలు పలికిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు వెన్నులో వణుకు స్టాటైంది.. జగన్ బయటికి వస్తే జనం ఏ రేంజ్ లో వస్తారనేది ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చింది..
నెల్లూరు సెంట్రల్ జైలు, గుంటూరు జైలు, పులివెందుల పర్యటన, విజయవాడ, పిఠాపురం వరద బాధితుల పరామర్శ.. ప్రాంతం ఏదైనా.. పరిస్షితులు ఏమైనా.. జగన్ వస్తున్నాడంటే చాలు.. జనమే.. జనం.. రోడ్ల వెంబడి.. ఆయన్ని చూసేందుకు బారులు తీరుతున్నారు.. ఈ దృశ్యాలు అన్ని ప్రాంతాల్లో కనిపించినవి.. ఓటమి తర్వాత ఆయన కొద్దిరోజులపాటు బయటికి రారని భావించిన టీడీపీ నేతలకు జగన్ షాకిచ్చారు.. వైసీపీ నేతలను ఓదార్చేందుకు, దైర్యం చెప్పేందుకు పరామర్శలు చేస్తున్నారు.. ఈ క్రమంలో ఆయన వస్తున్న జనాదరణ వైసీపీలో జోష్ నింపుతోంది.
మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.. జగన్ ప్రవర్తన వల్లే పార్టీ ఓడిపోయిందని విమర్శలు వినిపించాయి.. కానీ జగన్ బయటికి వస్తే జనాలు బ్రహ్మరథం పడుతూ ఉండటంతో టీడీపీ నేతలకు అసహనాన్ని తెప్పిస్తోందట.. జగన్ కు అంత మంది జనం ఎలా వస్తున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.. జగన్ కోసం వచ్చే జనాల్ని చూసి టీడీపీ నేతలకు కడుపు మండుతుంటే.. వైసీపీ క్యాడర్ మాత్రం మంచిజోష్ లో ఉంది.. తమ నాయకుడు ఇలాంటి పర్యటనలు చేస్తే.. పార్టీ మరింత పుంజుకునే అవకాశముంటుందని చెబుతోంది..