టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం సుదర్శన్రావు కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సుదర్శన్ రావు మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ తొలినాళ్లలో సుదర్శన్ రావు అద్భుతంగా పనిచేశారని సీఎం గుర్తుచేసుకున్నారు.