రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. విపక్షాల తీరుపై ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. 8 మంది రాజ్యసభ విపక్ష పార్టీల ఎంపీలను ఆయన నేడు సస్పెండ్ చేసారు. తృణముల్ కాంగ్రెస్ తో పాటుగా కాంగ్రెస్ కి చెందిన ఎంపీలను వారం పాటు సస్పెండ్ చేసారు. రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ గాంధీ విగ్రహం ఎదుట రాజ్యసభ విపక్షాల నిరసన తెలియజేస్తున్నాయి.
ఈ నిరసనలో టిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కేకే, బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూని చేస్తుందని నినాదాలు చేస్తున్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. నిన్న ప్రభుత్వం మూడు బిల్లులను ఆమోధించుకున్న సంగతి తెలిసిందే.