బిజెపికి సినిమా చూపించిన టీఆర్ఎస్…!

-

తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో తెరాస తన హవా కొనసాగించింది. మరోసారి తనకు ఉన్న ప్రజాభిమానాన్ని తెలంగాణా రాష్ట్ర సమితి బలంగా చాటుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరుకి విపక్షాలు పత్తా లేకుండా పోయాయి. ఏ ఒక్క జిల్లాలో కూడా విపక్షాలు ప్రశాంతంగా విజయం సాధించలేదు. తెరాస ధాటికి బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చేతులు ఎత్తేసాయి. తెరాస విజయానికి దాసోహం అన్నాయి.

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బిజెపి గురించి. తెలంగాణా లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన ఆ పార్టీ ఒక్క మున్సిపాలిటిలో విజయం సాధించడానికి నానా కష్టాలు పడింది. మేము గెలుస్తాం గెలుస్తాం గెలుస్తాం అంటూ పదే పదే కార్యకర్తలను భ్రమలో ఉంచే ప్రయత్నం చేసిన బిజెపి, తెరాస దెబ్బకు అబ్బా అంది. ఎక్కడో ఒక చోట మినహా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించిన దాఖలాలు లేవనే చెప్పాలి.

జాతీయ స్థాయిలో బలంగా ఉన్నాం తెలంగాణాలో కూడా కమలం వికసిస్తుంది అని భావించిన ఆ పార్టీకి కెసిఆర్, కేటిఆర్ ఇద్దరు కూడా చుక్కలు చూపించారు. తమను దాటి తెలంగాణా రాజకీయం చేయడం మీ వల్ల కాదు అనే విషయాన్నీ ఇద్దరూ బిజెపికి స్పష్టంగా చెప్పారు. మీ బలం ఉత్తరాదిన ఉందేమో తెలంగాణా గడ్డ మీద కాదని, నాలుగు ఎంపీ స్థానాలను గెలిచిన ఆ పార్టీకి ఒక్క మున్సిపాలిటీకి పరిమితం చేసారు.

అదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ ఎక్కడా కూడా ఆ పార్టీ సత్తా చాటలేదు. కరీంనగర్ ఫలితాలు త్వరలో రానున్నాయి. ఈ నాలుగు స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. కాని మున్సిపాలిటీలు గెలవలేకపోయింది. దీనితో తెలంగాణాలో బిజెపికి దారులు దాదాపుగా మూసుకుపోయినట్టే. రాజకీయంగా బలపడే అవకాశాలు ఆ పార్టీకి లేవు. తెలంగాణాలో తెరాస ని ఎదుర్కొని నిలబడటం కష్టం అనే విషయాన్నీ స్పష్టంగా అర్ధమైంది ఆ పార్టీకి.

Read more RELATED
Recommended to you

Exit mobile version