హుజూరాబాద్‌ వార్‌లో ట్విస్టులు… మరో కొత్త వ్యూహంతో కేసీఆర్… 

-

హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవడానికి సీఎం కేసీఆర్…రోజుకో వ్యూహం అన్నట్లు ముందుకెళుతున్నారు. హుజూరాబాద్‌లో ఎలాగైనా ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో కేసీఆర్, ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఇప్పటికే పలు రకాల వ్యూహాలని కేసీఆర్, హుజూరాబాద్ బరిలో అమలు చేశారు. ముఖ్యంగా దళితులని ఆకట్టుకోవడానికి అనేక ఎత్తులు వేస్తున్నారు. అందుకే దళితబంధు లాంటి భారీ స్కీమ్ తీసుకొచ్చారు.

Huzurabad | హుజురాబాద్

అలాగే దళిత ఓటర్లని ఆకట్టుకోవడానికి అనేక కొత్త వ్యూహాలతో కేసీఆర్ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో ఓ దళిత అధికారిని నియమించనున్నారు. రాహుల్‌ బొజ్జాని సీఎంఓ కార్యదర్శిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఓ దళిత అధికారికి ముఖ్యమంత్రి కార్యాలయంలో కొలువు దక్కడం ఇదే తొలిసారి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘దళిత బంధు’ పథకం పర్యవేక్షణ బాధ్యతలను రాహుల్‌ బొజ్జాకు అప్పగించనున్నారు.

ఇదేగాక దళితులని మరింత దగ్గర చేసుకోవడంలో భాగంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా ఇద్దరు దళిత ఎమ్మెల్యేలని క్యాబినెట్‌లోకి తీసుకొనున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం క్యాబినెట్‌లో పనితీరు బాగోని ఇద్దరినీ తప్పించి, దళిత నాయకులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇందులో ఒక యువ ఎమ్మెల్యే కూడా ఉన్నారని సమాచారం.

ఈ విధంగా కేసీఆర్…ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా దళితులని ఆకర్షించి…హుజూరాబాద్‌లో లబ్ది పొందటం పాటు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లబ్ది పొందాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే కేసీఆర్…దళిత మంత్రం జపిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు హుజూరాబాద్‌లో ఈటలని ఓడించడానికే కేసీఆర్…ఈ తరహా వ్యూహాలతో ముందుకెళుతున్నారని గట్టిగా చెప్పొచ్చు. మరి ఇన్నిరకాలుగా ఈటలని ఓడించాలని పనిచేస్తున్న కేసీఆర్ అనుకున్నట్లు హుజూరాబాద్‌లో ఫలితం వస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version