ఇన్ సైడ్ స్టోరీ : జగన్ నెగెటివ్ నిర్ణయం తీసుకుంటాడేమో అని కంగారు పడుతున్న వైకాపా క్యాడర్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాపకింద నీరులా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో గా అంచనా వేయలేని రీతిలో రాష్ట్రంలో 400 దాకా పాజిటివ్ కేసులు నమోదు అయిన సంగతి అందరికీ తెలిసినదే. శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో మినహా అన్ని జిల్లాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ‘లాక్‌డౌన్‌’ని ఉంచితే బెటరా? తీసేస్తే బెటరా? అన్న దాని గురించి ప్రధాన మోడీ తో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీకి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో ‘లాక్‌డౌన్‌’ విషయంలో ప్రధాని మోడీ కి సూచించిన విషయాలు ఏపీలో వైరల్ గా మారాయి.చాలా వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లు అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘లాక్‌డౌన్‌ పొడిగించాల్సిందే..’ అని చెప్పటం జరిగింది. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపుచేయలేని పరిస్థితిలో ఉన్న టైంలో వైయస్ జగన్ ‘లాక్‌డౌన్‌’ని కేవలం రెడ్‌ జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి సూచించడం జరిగింది. దీంతో వైయస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

 

అసలు ఎవరు అంచనా వెయ్యని విధంగా వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతుంటే ఈ విధంగా జగన్ ఎలా ‘లాక్‌డౌన్‌’ని కేవలం రెడ్‌ జోన్లకే ఎలా పరిమితం చేస్తారు అంటూ మండిపడుతున్నారు. డబ్బులు పోయినా పర్వాలేదు ప్రాణాలు పోతే మాత్రం ఎవరు ఆ నష్టాన్ని భర్తీ చేయగలరు? అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ క్యాడర్ కూడా జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతోంది. “లేని పోని బ్యాడ్ నేమ్ తెచ్చుకునే పని మాత్రం చేయకు జగన్ అన్నో” అంటూ బతిమాలుతున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు ‘లాక్‌డౌన్‌’ని పొడిగించడమే బెటర్ అని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version