ఓట్లు లేపేస్తున్నారు..నిజమెంత?

-

అధికారంలో ఉండే పార్టీలు..ప్రతిపక్షాలకు మద్ధతు ఇచ్చే వారి ఓట్లు లేపేసి..రాజకీయంగా ఇంకా లబ్ది పొందడానికి చూస్తున్నారని..ఎప్పటినుంచో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఓట్లు పోయాయని, వారు ఓట్లు వేయలేకపోయారని పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. ప్రచారం ఏముంది..అది నిజమే అని కూడా తేలింది. అయితే ఇదంతా అక్కడ అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీ చేయించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్తితి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అధికార వైసీపీ..తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లు తొలగించే పనిలో ఉన్నారని ప్రచారం వస్తుంది. ఇటీవల మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లని ఇంటింటికి అతికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎవరైతే స్టిక్కర్లు అంటించుకోవదాన్ని వ్యతిరేకిస్తారో..లేక అతికించాక చింపేస్తున్నారో..ఆ ఇళ్లపై వైసీపీ ఫోకస్ చేసి..వారి ఓట్లని లేపేయడానికి కుట్రలు చేస్తుందని టి‌డి‌పి ఆరోపిస్తుంది. ఇప్పటికే టి‌డి‌పి సానుభూతి పరుల ఓట్లని పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేసిందని టి‌డి‌పి నేతలు ఫైర్ అవుతున్నారు.

ఇప్పుడు ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తూ..ఎవరు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు..ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో చూసుకుని..వారి ఓట్లని లేపేస్తున్నారట. వైసీపీ నేతలు, వాలంటీర్లు స్టిక్కర్‌ అతికిస్తుంటే  స్వాగతించే వారిని తమ ఓటర్లుగానే పరిగణిస్తూ.. స్టిక్కర్‌ అతికించొద్దు అని గట్టిగా వ్యతిరేకించే వారు, ఇలా అతికించగానే అలా పీకేసే వారే వైసీపీ టార్గెట్‌ చేసి, వీరందరినీ ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లుగా నిర్ణయించి.. వారి ఓట్లని లేపేసే ప్రయత్నం చేస్తున్నారట.

ఇక కొందరి ఓటర్లని బూత్ మారుస్తూ..అంటే ఎప్పుడు వెళ్ళే బూత్ లకే ఓటర్లు వెళ్తారని, అక్కడ ఓటు లేదని తెలుసుకుని, వేరే బూత్ వెతుక్కునే సరికి టైమ్ పడుతుందని ఓటు ఎక్కడ ఉందో తెలియక వెనుదిరుగుతారని, అలా వ్యతిరేక ఓట్లని వేయనివ్వకుండా చేయడమే వైసీపీ టార్గెట్ అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో ఎన్నికల సమయంలోనే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version