వరంగల్‌లో కారు హవా.. కాంగ్రెస్ బ్రేకులు వేస్తుందా?

-

పోరాటాల పురిటిగడ్డ వరంగల్ లో ఈ సారి రాజకీయాలు రసవత్తరంగా సాగేలా ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో అక్కడ బి‌ఆర్‌ఎస్ పార్టీ వన్ సైడ్ గా గెలుస్తూ వచ్చేసింది.. కానీ ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టఫ్ ఫైట్ ఎదుర్కోవాలి. ముఖ్యంగా కొన్ని స్థానాల్లో బి‌జే‌పి నుంచి పోటీ ఎదురుకోవాలి. ఈ సారి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఆసక్తికరమైన పోరు జరిగేలా ఉంది.

వరంగల్ పార్లమెంట్ పరిధిలో..వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, భూపాలపల్లి, పాలకుర్తి, పరకాల, స్టేషన్ ఘనపూర్ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క భూపాలపల్లి మినహా మిగిలిన స్థానాలని బి‌ఆర్‌ఎస్ గెలుచుకుంది. ఇక భూపాలపల్లిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణరెడ్డి…తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో మొత్తం బి‌ఆర్‌ఎస్ ఆధిక్యమైంది. ఈ సారి ఎన్నికల్లో వరంగల్ లో మళ్ళీ సత్తా చాటాలని బి‌ఆర్‌ఎస్ చూస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ సైతం ఈ సారి బి‌ఆర్‌ఎస్ కు చెక్ పెట్టాలని చూస్తుంది.

అందులో భాగంగా పరకాలలో ఈ సారి బి‌ఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వనుంది. అక్కడ బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డికి..కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ చెక్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇటు భూపాలపల్లిలో గండ్ర రమణారెడ్డికి..కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వన్ సైడ్ గా గెలిచేస్తారు..అక్కడ ఆయనకు బ్రేకులు వేయలేరు. స్టేషన్ ఘనపూర్ లో ఈ సారి రాజయ్యకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. అటు సొంత పార్టీలో కడియం శ్రీహరి సహకారం అందకపోవచ్చు.

ఇక వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు మళ్ళీ ఛాన్స్ కనిపిస్తుంది. వరంగల్ ఈస్ట్ లో ఎమ్మెల్యే నరేందర్‌కు కొండా ఫ్యామిలీ పోటీ ఇవ్వనుంది. అటు వరంగల్ వెస్ట్ లో వినయ్ భాస్కర్‌కు కాంగ్రెస్, బి‌జే‌పి నుంచి పోటీ ఎదురవుతుంది. ఏదేమైనా ఈ సారి వరంగల్ లో బి‌ఆర్‌ఎస్ గట్టి పోటీ ఎదురుకొక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version