వరంగల్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ అంటేనే మంత్రులు ప్రజాప్రతినిధులు భయపడుతున్నారు.. గత ప్రభుత్వంలో సమీక్షలు సమావేశాలతో సందడిగా మారిన ఈ బంగ్లా ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది.. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఈ బంగ్లాన్ని ఉపయోగించుకున్న నేతలందరూ ఓటమిపాలవుతున్నారనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినిపిస్తోంది..
2014లో మధుసూదనా చారి మంత్రిగా ఉన్న సమయంలో ఈ బంగ్లాను ఉపయోగించారు.. సుమారు నాలుగేళ్ల పాటు ఈ బంగ్లాని ఆయన ఉపయోగించుకున్నారు.. అనంతరం జరిగిన ఎన్నికల్లో మధుసూదనా చారి ఘోరంగా ఓటమిపాలయ్యారు.. అనంతరం 2019లో ఎర్రబెల్లి దయాకర్ సైతం క్యాంప్ ఆఫీస్ గా ఈ బంగ్లా ను ఉపయోగించుకొని సమీక్షలు సమావేశాలు నిర్వహించారు.. తర్వాత జరిగిన ఎన్నికలలో ఎర్రబెల్లి దయాకర్ ఓడిపోవడంతో ఈ సెంటిమెంట్ బలంగా మారింది..
ఈ బంగ్లా కి వాస్తు దోషం ఉండడంతో ఎర్రబెల్లి దయాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కొన్ని మార్పులు చేశారట.. ఉత్తర ద్వారాన్ని పూర్తిగా మూసేసి తూర్పు ద్వారం ద్వారా రాకపోకలు సాగించేవారు.. అయినా కూడా 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన అద్దంకి దయాకర్ 26 ఏళ్ళ వయసున్న యశస్విని రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో వాస్తు దోషం కారణంగానే దయాకర్ ఓడిపోయారని పార్టీలో హాట్ హాట్ చర్చ నడుస్తుంది..
ఈ బంగ్లా ను ఉపయోగించిన మధుసూదనాచారి తో పాటు ఎర్రబెల్లి దయాకర్ కూడా ఓడిపోవడంతో ఇక్కడ వాస్తు దోషము ఉందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారట.. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీతక్కతో పాటు కొండా సురేఖ సైతం ఈ బంగ్లాకి రావడానికి ఆలోచిస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.. ఈ క్రమంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ బంగ్లాని ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూడాలి మరి..