అదేంటో గానీ ఈ మధ్య టీఆర్ఎస్ TRSకు చెందిన అందరు ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అలాగే గంగుల కమలాకర్ లాంటి వాళ్లు ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై గుట్కా తిన్నారనే విమర్శలు చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో ఆయన గుట్కా బుక్కారనే వార్తలు తెగ హల్ చల్ చేశాయి.
ఇక అప్పటి నుంచి ఆయన ఎక్కడకు వెళ్లినా ఈ సెగ తగులుతూనే ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా దీనిపై పెద్ద రాద్ధాంతమే చేస్తున్నాయి. గుట్కా తినే మంత్రి ప్రజలకు ఏం సేవ చేస్తారంటూ పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ఇక బీజేపీ అయితే దొరికిందే సందు అన్నట్టు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తోంది. ఇక వాటిని పట్టించుకోకుండా తలసాని రీసెంట్‌గా హుజూరాబాద్ కు వచ్చారు.
రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఆయన హుజూరాబాద్‌లో ప్రోగ్రామ్ నిర్వహించారు. దీంతో ఆయనపై బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలు పెట్టారు. గుట్కా తినే మంత్రికి గుట్కా తినుకోకుండా ఉండక ఇక్కడకు ఎందుకు వచ్చిండు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ మ్యాటర్‌పై టీఆర్ఎస్ అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. పబ్లిక్‌లో ఇమేజ్ పోతే కష్టమని పై నుంచి ఆర్డర్లు కూడా వస్తున్నాయంట. చూడాలి మరి ఏం జరుగుతోందో.