ఝార్ఖండ్ లో పైచేయి ఎవరిది..? ఈసారి హోరాహోరీ తప్పదా..?

-

అధికారాన్ని మరోసారి హస్తగతం చేసుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తుంటే.. ఈసారి ఎలాగైనా సీఎం పీఠాన్ని అధిరోహించాలని ఎన్డీఏ కూటమి పావులు కదుపుతోంది.. నువ్వా.. నేనా అంటూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి.. దీంతో ఝార్ఖండ్ లో మరో రసవత్తర పోరు తప్పదన్న ప్రచారం జరుగుతోంది.. ఇంతకీ ఏయే అంశాలను ప్రచార అస్త్రాలుగా మారబోతున్నాయి..? అధికార కూటమి ఏ స్టాటజీతో ప్రచారాన్నిసిద్దమవుతోంది..? చూద్దాం..

81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్ లో గత ఎన్నికల్లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. ఈసారి కూడా గెలుపు ఖాయమనే ధీమాలో ఆ పార్టీలున్నాయి..
ఝార్ఖండ్ లో 81 సీట్లుండగా..అందులో 28 ఎస్టీ రిజర్వ్డ్ స్తానాలున్నాయి.. వాటిల్లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ బలంగా ఉంది.. సంక్షేమ పథకాలే తమకు మరోసారి అధికారాన్ని తీసుకొస్తాయని ఆ పార్టీ భావిస్తోంది.. అకారణంగా తనను అరెస్టు చేశారన్న సింపతీతో గిరిజన ఓట్లు కొల్లగొట్టొచ్చని సీఎం హేమంత్ సోరెన్ ప్లాన్ గా ఉంది..

మరోపక్క గిరిజన తెగల్లో బలమైన నేతగా ఉన్న మాజీ సీఎం మాజీ సీఎం చంపయీ సోరెన్ పార్టీని వీడటం మైనస్ గా చెప్పుకోవచ్చు.. ఝార్ఖండ్ లో అధికారంపై గురిపెట్టిన బిజేపీ.. ఎన్నికల షెడ్యూల్ కు ముందే ప్రచారం మొదలుపెట్టింది.. బంగ్లాదేశీయుల చొరబాట్లు, అవినీతి, హేమంత్ సోరెన్ అరెస్టులను ప్రచార అస్త్రాలుగా ఎక్కుపెట్టబోతుంది.. మాజీ సీఎం చంపయీ సోరెన్ ఆ పార్టీలో చేరడం అదనపు బలంగా చెప్పుకోవచ్చు..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఝార్ఖండ్లో ప్రధాని నరేంద్రమోడీతో పాటు.. అమిత్ షాలు పర్యటిస్తున్నారు.. వేల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకు శంకుస్షాపనలు చేస్తూ.. అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.. అభ్యర్దులను త్వరగా ప్రకటించి.. ఎన్నికల ప్రచారాలకు బిజేపీ దూకుతోంది.. మొత్తంగా రెండు కూటములు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నాయి. చివరికి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version