ఓవైసీ కట్టడాలు ఎందుకు కూల్చరు.. హైడ్రాపై బండి సంజయ్ విమర్శలు!

-

హైదరాబాద్ మహానగర పరిధిలో హైడ్రా కూల్చివేతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి ఘాటుగా స్పందించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం కక్ష సాధింపు చర్యల కోసమే హైడ్రా కూల్చివేతలు ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. నగరంలోని అన్ని ఆక్రమణల విషయంలో హైడ్రా ఓకేలా స్పందించడం లేదని విమర్శించారు.

హైడ్రా నిజంగా ఎవరికి కొమ్ము ఖాయకుండా, పారదర్శకంగా విధులు నిర్వర్తించినట్లయితే సకలం చెరువులోని ఓవైసీ ఆక్రమణలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. కేవలం ఆ కాలేజీకి మాత్రమే ఏడాది సమయం ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని రేవంత్ సర్కారును డిమాండ్ చేశారు. విద్యార్థులు అకాడమిక్ ఇయర్ కోల్పోతారని ప్రభుత్వం వెనకడుగు వేయడం వెనుక ఉద్దేశం ఏంటని.. టాప్ కాలేజీల్లో వారికి ప్రవేశాలు కల్పిస్తే సరిపోతుందని కాదా అని చెప్పారు. అందరికీ ఓకే న్యాయమైతే ఓవైసీ బ్రదర్స్ కు చెందిన కాలేజీని వెంటనే కూల్చివేయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version