ఇప్పుడు తెలంగాణలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంట అది కేవలం హుజూరాబాద్ బైపోల్ ఎలక్షన్ మాత్రమే అని చెప్పాలి. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఈ ఎలక్షన్ కోసమే ఎంతగానో ప్లాన్లు వేస్తున్నాయి. ఇక టీఆర్ ఎస్, బీజేపీ అయితే ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో హోరాహోరీగా ప్రచార చేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే కాంగ్రెస్ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదు. ఇంకా అభ్యర్థిని కూడా ప్రకటించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ప్రకటించుకున్న పాడి కౌశిక్‌రెడ్డి కాస్త గులాబీ గూటికి చేరుకున్నాడు. ఇక ఆయన స్థానంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెండు సార్లు సమావేశాలు నిర్వహించినా కూడా అసలు ఎవరు అభ్యర్థి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఇక ఈ క్రమంలోనే కొండా సురేఖ పేరు అలాగే పత్తి శ్రీనివాస్ రెడ్డి లాంటి పేర్లు కూడా వినిపించాయి. కానీ వారెవ్వరినీ రేవంత్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
అయితే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ తరఫున అసలు ఎవరినీ బరిలో నిలిచేందుకు సిద్ధంగా లేదని ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పోటీ చేసినా కనీసం డిపాజిట్ కూడా దక్కదనే ఆలోచనతో రేవంత్ ఉన్నారంట. అలాగే కాంగ్రెస్ తరఫున అభ్యర్థిని నిలిపితే ఓట్ల చీలికి జరిగి అది కాస్తా చివరకు అధికార టీఆర్ ఎస్ పార్టీకే లాభం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్లు భిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. ఇక ఈటల గెలిచినా కూడా ఆ క్రెడిట్ బీజేపీకి వెళ్లకుండా ఈటలకే వెళ్తుంది కాబట్టి కాంగ్రెస్‌కు పెద్ద నష్టమేమీ లేదనే భావనలో రేవంత్ ఉన్నారంట.