సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా మారిన సీఎం జగన్.. మరో సంచలన నిర్ణయం వెల్లడించేందుకు రెడీ అయ్యారా? ఆయన వ్యూ హం మేరకు రాష్ట్ర స్వరూపం భౌగోళికంగా మారిపోతుందా? ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర స్వరూపాన్ని అమాంతం మార్చేందుకు అ డుగులు వేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు సీఎంవో అధికారులు. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగు మాధ్యమం ఎత్తివేత, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల విభజన, మూడు రాజధానుల నిర్ణయంవంటి వాటితో సంచలనాలకు వేదికగా మారిన జగన్.. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే రివర్స్ టెండర్లతో దేశవ్యాప్తంగా లీడర్ ఆఫ్‌ది న్యూస్‌గా మారారు.
అయితే, ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు ఆయన రెడీ అయ్యారని తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ నిర్ణయంవెల్లడించేందుకు రెడీ అయిన జగన్ దీనికి సంబందించిన గ్రౌండ్‌ను ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన ఎన్నికలకు ముందుగానే ప్రకటించిన రాష్ట్రంలో జిల్లాల సంఖ్యలను పెంచేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో మొత్తం పార్లమెంటు స్థానాలు 25 ఉన్నాయి. వీటిని జిల్లాలుగా మార్చి మొ త్తం రాష్ట్రంలో మరో 12 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ యోచిస్తున్నారు.
అంటే.. కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు ఒకటి రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఇకపై పార్లమెంటు నియోజకవర్గం పరిధే ఒక జిల్లా కానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇక, 2023లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కూడా ఉంటుంది. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని మొత్తంగా రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటు, వాటికి ఎన్టీఆర్‌సహా అల్లూరి సీతారామరాజు వంటి కీలక వ్యక్తుల పేర్లు పెట్టేలా నిర్ణయం తీసుకునేందుకు జగన్ వడివడిగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు సీఎంవో వర్గాలు ఆఫ్‌ది రికార్డుగా మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది.