ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అజెండా ప్రకారమే ఎన్నికలను వాయిదా వేసారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. అన్ని పార్టీలను అడిగామని ఎన్నికల సంఘం చెప్తుందని ఎవరిని అడిగింది అని ఆయన నిలదీశారు. నిమ్మగడ్డ రమేష్ కి సిగ్గు ఉంటే రాజీనామా చెయ్యాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేసారు.
టీడీపీ అనేది మునిగిపోతున్న నావ అని దాన్ని లేపడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్టుగా అధికారుల బదిలీలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం అధికారులపై మాకు గౌరవం ఉందని అన్నారు. ఈసీ నిర్ణయంపై సుప్రీం కోర్ట్ కి వెళ్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉంటాయని అన్నారు.
నిమ్మగడ్డ రమేష్ చర్య, అప్రజాస్వామికమా కాదా అనేది కోర్టులే తెలుస్తాయని విజయసాయి రెడ్డి అన్నారు. ఎవరిని సంప్రదించలేదని, టీడీపీ ఒక్కటే రాజకీయ పార్టీనా అని విజయసాయి ప్రశ్నించారు. నాలుగు కోట్ల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే వైరస్ సోకింది అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కి విలువలు లేవు అని టీడీపీని కాపాడుకోవడానికే ఆయన ఈ విధంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు.