వైసీపీ టార్గెట్ ఇప్పటం: పవన్ తగ్గట్లేదు..!

-

గత విశాఖ ఘటన నుంచి పవన్ కల్యాణ్ టార్గెట్‌గా వైసీపీ రాజకీయం నడుపుతూనే ఉంది..ఎక్కడకక్కడ పవన్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. విశాఖలో పవన్ జనవాణి కార్యక్రమానికి బ్రేక్ వేశారు..అలాగే పవన్‌పై వైసీపీ నేతలు వరుసగా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు-పవన్ కలిసిన నేపథ్యంలో కాపు ఓట్లు పోకుండా కాపు నేతలతో సెపరేట్ రాజకీయం నడిపిస్తున్నారు.

ఇలా పవన్‌ని ఎక్కడకక్కడ ఇరుకున పెట్టేలా వైసీపీ స్కెచ్ ఉంది.ఇదే క్రమంలో రోడ్ విస్తరణ పనులని చెప్పి..మంగళగిరి నియోజకవర్గం..తాడేపల్లిలోని ఇప్పటం గ్రామంలో కొందరు ఇళ్ళు కూల్చివేత కార్యక్రమం జరిగింది. అయితే ఈ ఇప్పటం గ్రామ ప్రజలు..గత మార్చి 14న జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారు. ఇక ఆ కక్షతోనే ఇప్పుడు 70 అడుగుల రోడ్ ఉండి కూడా..120 అడుగుల రోడ్ పేరుతో ఇళ్లని కూల్చివేసే కార్యక్రమం జరుగుతుందని జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. అసలు పెద్దగా వాహనాలు తిరగని ఇప్పటం రోడ్డులో 70 అడుగుల రోడ్డు ఎక్కువ. కానీ వైసీపీ ప్రభుత్వం కావాలని 120 అడుగుల రోడ్డు అని చెప్పి..జనసేన సభకు భూములు ఇచ్చిన వారి ఇళ్లని కూల్చివేసే కార్యక్రమం జరుగుతుందని తెలుస్తోంది.

అయితే దీనిపై జనసేన నేత కోర్టుకు వెళ్ళగా, కూల్చివేతలపై స్టే వచ్చింది. ఇక ఇదే క్రమంలో ఇళ్ళు కోల్పోయిన బాధితులకు అండగా ఉండేందుకు పవన్ ఇప్పటంలో పర్యటించనున్నారు. ఆవిర్భావ సభ సమయంలోనే ఇప్పటం గ్రామ్ అభివృద్ధి కోసం 50 లక్షలు ఇచ్చారు. పవన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటంలో ఉద్రిక్తత పరిస్తితులు ఉన్నాయి.

పవన్‌ పర్యటనని పోలీసులు అడ్డుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా గాని వైసీపీ చేసే కొన్ని కార్యక్రమాల వల్ల పరోక్షంగా పవన్‌కే బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఆయన ఇమేజ్ పెంచుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version