యూపీ సీఎం ప‌ద‌వికి యోగి ఆదిత్య‌నాథ్ రాజీనామా

-

ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ త‌న ప‌దివికి రాజీనామా చేశారు. యోగితో పాటు పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జీత్ సింగ్, మ‌ణిపూర్ సీఎం బీరేన్ సింగ్, ఉత్త‌రా ఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామీ రాజీనామా చేశారు. అలాగే గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ నేడు రాజీనామా చేయ‌నున్నారు. కాగ వీరి ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో రాజీనామా చేయాల‌ని ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ సూచించారు. దీంతో ముఖ్య‌మంత్రులు శుక్ర‌వారం రాజీనామా చేశారు.

కేబినేట్, శాస‌న స‌భ‌లు కూడా ర‌ద్దు అయ్యాయి. కాగ ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యే వ‌ర‌కు ఆప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రులుగా కొన‌సాగుతారు. కాగ ఉత్త‌ర ప్ర‌దేశ్ తో పాటు ఉత్త‌రా ఖండ్, గోవా, మ‌ణిపూర్ ల‌లో బీజేపీయే విజ‌యం సాధించ‌డంతో మ‌ళ్లీ యోగీ, పుష్క‌ర్ సింగ్ ధామీ, ప్ర‌మోద్ సావంత్, బీరేన్ సింగ్ లే ముఖ్య‌మంత్రులుగా ఎన్నిక అయ్యే అవ‌కాశం ఉంది. అలాగే పంజాబ్ లో మొద‌టి సారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నున్న ఆప్.. త‌న ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ నెల 16 వ తేదీన పంజాబ్ సీఎం గా భ‌గ‌వంత్ మాన్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version