బాబు వ్యూహానికి జ‌గ‌న్ ప్ర‌తివ్యూహం.. అదిరిపోయిన ట్విస్ట్‌..!

-

వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ఏపీ రాజ‌కీయాలు ముందుకు సాగుతున్నాయి. అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు, నేత‌ల‌కు అంతు చిక్క‌ని విధంగా సీఎం జ‌గ‌న్ దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే మూడు రాజ‌ధానులు, త‌ర్వాత అమ‌రావ‌తిలో తెర‌మీదికి వ‌చ్చిన ఆం దోళ‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు రోడ్ల మీదికి వ‌చ్చారు. దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్ర బాబు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీని చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలంటూ ప్ర‌జల కు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. దీంతో నిజంగానే గుంటూరు జిల్లాలోని వైసీపీ ప్ర‌జాప్ర‌తినిదులు ఒకింత ఆవేద‌న‌లో ముగినిపోయారు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో రాజ‌ధాని గ్రామాల్లో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగితే.. త‌మ‌కే అనుకూలంగా ఉం టుంద‌ని టీడీపీ భావించింది. అదేస‌మ‌యంలో అధికార ప‌క్షానికితీవ్ర ఎదురు దెబ్బ త‌ప్ప‌ద‌ని కూడా అంచ నా వేసుకుంది. ఈ క్ర‌మంలో నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఏక‌తాటిపైకి తెచ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య త్నాలు ప్రారంబించారు. వ్యూహం ప్ర‌కారం వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు స‌ర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఇంతలోనే ప్ర‌భుత్వాధినేత, వైసీపీ చీఫ్ జ‌గ‌న్ చంద్ర‌బాబు వ్యూహానికి ప్ర‌తివ్యూహం సిద్ధం చేశారు. రాజ‌ధాని గ్రామాల్లో అస‌లు ఎన్నిక‌లే లేకుండా చేసేశారు. ఈ ప్రాంతాల‌ను అన్నింటినీ క‌లిని అమ‌రావ‌తి మెట్రోపాలిటిన్‌ కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఫ‌లితంగా ఇప్ప‌ట్లో స్తానిక ఎన్నిక‌లు ఇక్క‌డ జ‌రిగే అవ‌కాశం లేదు. రాజధాని అమరావతి పరిధిలోని ఎర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలోకి విలీనం చేస్తూ ఇటీవలే జీవో జారీ చేశారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మునిసిపాలిటీలో కలిపారు. దీనిపై రాజధాని రైతులు హైకోర్టులో సవాలు చేశారు. ఈ విలీనాన్ని కోర్టు కొట్టేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండతో పాటు తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాలను కలిపి అమరావతి మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటును ప్రతిపాదించారు.

దీంతో ఆ మండలంలోనూ ఎన్నికలు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. కొత్తగా ఏర్పడిన దాచేపల్లి, గురజాల నగర పంచాయతీల్లో ఇంకా వార్డుల విభజన జరగక‌పోవ‌డంతో ఆ రెండు చోట్ల కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో చంద్ర‌బాబు వ్యూహం విఫ‌ల‌మైంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఆల‌స్య‌మైనా.. త‌ర్వాతైనా ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. అయితే, అప్ప‌టికి ప‌రిస్తితిని బ‌ట్టి ముందుకు పోవ‌చ్చ‌నేది జ‌గ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version