మోడీతో వీడియో కాన్ఫరెన్స్ కి నో చెప్పిన జగన్..!

-

కరోనాని కట్టడి చేసేందు కొత్త మార్గాలు వెతికే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపద్యంలో రాష్ట్ర సీఎంల సలహాలు, వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలని కేంద్రం భావించింది. అందుకే నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ, అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అయితే తాజాగా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు తాను హాజరు కాలేనని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన సమాచారం పంపారు. తమ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ప్రస్తావించిన జగన్, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సమావేశాలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సి వుందని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను సభలో ఉండటం తప్పనిసరైన నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనలేనని జగన్ వెల్లడించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version