జగన్ రంగంలోకి దిగితే టీడీపీకి కష్టమే.. లోకల్ వార్ పై జగన్ ద్రుష్టి

-

రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న జగన్.. రాటుదేలారు. ఒంటరిగా ప్రయాణాన్ని స్టార్ట్ చేసి.. మొదటి ప్రయత్నంలో ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు.. తర్వాత ఎన్నికల్లో
సునామీ లాగా అధికారాన్ని ఛేజిక్కించుకున్నారు.. ప్రతి గడపకు సంక్షేమాన్ని తీసుకెళ్లినా ఎక్కడో దెబ్బ కొట్టి.. మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు.. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ కథ అయిపోయిందని అందరూ కామెంట్స్ చెయ్యడం ప్రారంభించారు.. కానీ ఎమ్మెల్సి ఉప ఎన్నిక గెలుపుతో జగన్ సత్తా ఏంటో కూటమి ప్రభుత్వానికి తెలిసోచ్చింది..

విశాఖ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది.. మాజీమంత్రి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణని శాసన మండలికి పంపడం ద్వారా.. మూడేళ్ల పాటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చని జగన్ భావించారట.. ఇందుకోసం స్వయంగా జగనే రంగంలోకి దిగారు.. విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించి.. కూటమి పోటీ చేయడానికే ఆలోచించేలా వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. విశాఖ కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు బాధ్యతలను జగన్మోహన్ డీల్ చేసి ఉంటే.. అది చేజారేదే కాదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి..

మరో ఏడాదిన్నర కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.. ఈ ఎన్నికలు వైసీపీకి అత్యంత కీలకమైనవి.. వీటిల్లో అధిక చోట్ల విజయం సాధించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.. ఇందులో భాగంగానే.. టిడిపి నేతల దాడుల్లో గాయపడిన కార్యకర్తలను ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.. వారిలో ధైర్యం నింపడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవచ్చని ఆలోచనలో ఆయన ఉన్నారట.. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను తీసేస్తున్నారనే ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా ముమ్మరం చేసింది.. ఈ ఏడాదిన్నరలో ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి.. అది పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ అధినేత జగన్ పక్క ప్లాన్ తో ఉన్నారట..

Read more RELATED
Recommended to you

Exit mobile version