ఆ దేశ సూత్రం ఏపీ లో అమలు చేయబోతున్న జగన్ – ఎలక్షన్ గ్యారెంటీ ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 400 దాటేశాయి. కానీ వైయస్ జగన్ మాత్రం ఎటువంటి పరిస్థితి ఉన్నాగాని రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిపించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు ఏపీలో పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా దేశ సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడానికి జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దక్షిణ కొరియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 10,000 నమోదయ్యాయి. 214 మంది చనిపోయారు. అంతే కాకుండా ఏకంగా ఆ దేశానికి సంబంధించిన మంత్రి ఒకరు క్వారంటైన్ లో ఉన్నారు. ఇటువంటి టైములో కూడా దక్షిణ కొరియా యధావిధిగా పార్లమెంటు ఎన్నికలు జరిపించడానికి రెడీ అయింది.రాబోయే బుధవారం జరగబోయే ఈ పార్లమెంటు ఎన్నికలకు దక్షిణ కొరియా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాయి. పోలింగ్ జరిగే టైంలో విధులు నిర్వహించే అధికారులకు అన్ని రకాల రక్షణ పరికరాలు, మాస్కులు, సూట్ లు ఇస్తున్నారు. దక్షిణ కొరియాలో మొత్తం 14 వేల పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. జనం దూరంగా నిలుచునేలా మార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు దక్షిణ కొరియాలో వాడే ఈ ఫార్ములానే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ఫాలో అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెడ్ జోన్ మరియు ఆరెంజ్ జోన్ ప్రాంతాలలో కాకుండా మిగతా గ్రీన్ జోన్ ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటోంది.

 

అయితే ఏపీలో ప్రజలు మాత్రం ఎలక్షన్స్ నిర్వహిస్తే పాల్గొనే ప్రసక్తి లేదు అని అంటున్నారు. ఎవరైనా ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహిస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అసలే ఉన్న కొద్ది వైరస్ పాజిటివ్ కేసులు చాప కింద నీరులా ఎప్పుడు ఏ టైంలో పెరుగుతున్నాయో తెలియటం లేదు. ఇటు వంటి ప్రమాదకరమైన సమయంలో వైరస్ ఏమాత్రం విజృంభించిన రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ముందు కరోనా వైరస్ అంతా కట్టడి చేశాక అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని మరి కొంతమంది జగన్ సర్కార్ కి సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version