సీఈసీతో వైఎస్ జగన్ భేటీ.. ఆ ముగ్గురిని బదిలీ చేయాల్సిందే!

-

ఏపీలో త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అలజడులు మొదలయ్యాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్.. ఇవాళ ఢిల్లీ వెళ్లారు. ఆయన బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లిన జగన్.. సీఈసీ సునీల్ అరోరాను కలిశారు. టీడీపీ పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. టీడీపీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని జగన్ బృందం ఆధారాలతో సహా నిరూపించింది. ఏపీలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరగాలంటే.. ఏపీ డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వర రావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ రావులను బదిలీ చేయాలని… వాళ్ల స్థానంలో వేరే వాళ్లను నియమించాలని అప్పుడే ఏపీలో చంద్రబాబు ఆటలు సాగవని జగన్ స్పష్టం చేశారు.

చంద్రబాబు ఓటర్ల లిస్టును తారుమారు చేసి దాదాపు 59.18 లక్షల నకిలీ ఓట్లను చేర్చాడని జగన్ ఆరోపించారు. ఇప్పటికే 4 లక్షల మంది వైఎస్సాఆర్‌సీపీ ఓట్లను తొలగించారని ఫిర్యాదు చేశారు. యాప్‌ను క్రియేట్ చేసి దాని ద్వారా ఓట్లను తొలగిస్తూ.. వాటి స్థానంలో నకిలీ ఓట్లను సృష్టిస్తున్నట్టు జగన్ బృందం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. అలాగే పోలీసు వ్యవస్థను కూడా చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నట్టు జగన్ ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏపీలో రాజ్యమేలుతున్న చంద్రబాబుపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ఈసందర్భంగా ఈసీకి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version