ఒకరిద్దరు కాదు 8 మంది పిల్లలు కావాలట..!

-

హైదరాబాద్ అమ్మాయే అయినా మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ లో సెటిల్ అయిన అదితి రావు హైదరి ఈమధ్యనే తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. మణిరత్నం చెలియా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అదితి ఆ తర్వాత సమ్మోహనం, అంతరిక్షం లాంటి సినిమాలు చేసింది. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు 8 మంది పిల్లలు కావాలని షాకింగ్ కామెంట్స్ చేసింది.

8 మంది పిల్లలా అదెలా అనుకోవచ్చు.. తన జీవితంలో ఓ 8 మంది పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకోవాలని అంటుంది అదితి రావు హైదరి. 8 అమ్మడి లక్కీ నంబరో లేక మరేమో తెలియదు కాని ఒకరిద్దరు కాదు ఏకంగా 8 మందిని అడాప్ట్ చేసుకుని వారికి కావాల్సినవన్ని చూస్తా అంటుంది. అంతేకాదు వారికి మంచి చదువు చెప్పించే బాధ్యత కూడా తీసుకుంటా అంటుంది. చిన్న వయసులోనే ఇంత గొప్ప ఆలోచన రావడం మంచిదే.. హీరోయిన్ గా సంపాదించిన మొత్తాన్ని జల్సాలకు ఖర్చు చేయకుండా ఇలా సమాజ సేవకు వాడితే కచ్చితంగా ఆమెకు మంచి జరిగుతుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version