బాబును మించిన జ‌గ‌న్ విజ‌న్‌… సంచ‌ల‌నాలకు కేరాఫ్‌

-

రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారిన నాటి నుంచి అనేక సరికొత్త నిర్ణ‌యాల‌తో దూసుకుపోతున్నారు వైసీపీ అధినే త, సీఎం జ‌గ‌న్‌. ఎన్నిక‌ల‌కు దాదాపు ఏడాది కాలంగా పాల‌న ఎలా ఉంటే బాగుంటుంద‌నే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న‌ట్టుగా తాజా ప‌రిస్థితులు స్ప‌ష్టం చేస్తున్నాయి. కీల‌క ప్రాజెక్టులైన అమ‌రావ‌తి రాజ‌ధాని, పోల‌వ రం, ఇత‌ర సాగు, తాగు నీటి ప్రాజెక్టులు, పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ వంటి విష‌యాల‌పై జ‌గ‌న్ అండ్ కోలు త‌మ‌దైన శైలిలో వెళ్తున్నారు. దీనిలో ప్ర‌జాసంక్షేమ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు అనేకం ఉన్నాయి. అయితే, కొన్నింటి విష‌యంలో కొంత వివాదం నెల‌కొన్నా.. అది ఉద్దేశ పూర్వ‌కంగా చేస్తున్న‌దే త‌ప్ప‌.. సాధార‌ణంగా ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌త మాత్రం ఎంత‌మాత్రం కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ముఖ్యంగా పోల‌వ‌రం కానీ, ఇత‌ర ప్రాజెక్టులు కానీ రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు వెళ్ల‌డం, రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చిన సంస్థ‌ల చేతికి గ‌త ప్ర‌భుత్వం ఉదారంగా ఇచ్చిన వేల ఎక‌రాల భూముల‌ను వెనక్కి తీసుకోవ‌డం, గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను దేశంలోనే ఉన్న‌తంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నించ‌డం, పాల‌న‌ను క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయ‌డం, రాష్ట్ర ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మాధ్య‌మాన్ని త‌ప్ప నిస‌రి చేయ‌డం.. ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం వంటివి అత్యంత కీల‌క‌మైన అంశాలుగా పేర్కొన వ‌చ్చు. ఈ విష‌యాల్లో ప్ర‌తిప‌క్షాలు యాగీ చేస్తున్నా.. త‌ర్వాత అవి సైలెంట్ అయిపోవ‌డాన్ని బ‌ట్టి.. ప్ర‌జాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ది అనేవి .. వీటిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌నేది నిర్వివాదాంశం.

అయితే, ఇన్ని ప‌థ‌కాలు, నిర్ణ‌యాలు జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేవ‌లం ఆరు మాసాల్లోనే తెర‌మీదికి తెచ్చి.. అమ లు చేయ‌డం వంటివి అంత ఈజీ అయితే కాదు. మ‌హా మేధావి, అప‌ర చాణిక్యుడుగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఆర్టీసీని విలీనం చేయ‌డం, గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీర్చిది ద్దడం వంటివి చేత‌కాలేద‌నే చెప్పాలి. అలాంటిది జ‌గ‌న్ సాధ్యం చేస్తున్నారు మ‌రి ఆయ‌న ఇవ‌న్నీ ఓవ‌ర్ నైట్ వేసుకున్న ప్ర‌ణాళిక‌లేనా.. అధికారంలోకి వ‌చ్చాక తీరిగ్గా తీసుకున్న నిర్ణ‌యాలేనా? అంటే.. కాద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచే వైసీపీ యాక్టివ్ అయింది.

పాద‌యాత్ర ప్రారంభించిన నాలుగు మాసాల‌కే ఈ ప‌థ‌కాల‌పై స్ప‌ష్ట‌మైన గ్రాఫ్‌ను జ‌గ‌న్ త‌యారు చేసుకున్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు, వారి స‌మ‌స్య‌లు, వాటికి ప‌రిష్కారాలు ఏర్చికూర్చుకున్నారు. ప‌ర్య‌వ‌సానంగా ఆయ‌న దూకుడు పెంచారు. అధికారంలోకి వ‌చ్చిన ఆరు మాసాల్లోనే త‌న‌దైన దూకుడుతో వాటిని అమ‌లు చేశారు. ఇక‌, ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన ఆంగ్ల మాధ్య‌మం విష‌యంలో ఒక మెట్టు దిగినా.. అంటే.. ఆదిలో వ‌చ్చే ఏడాది నుంచి 1 నుంచి 8 త‌ర‌గ‌తుల వ‌ర‌కు అన్న ప్ర‌భుత్వం దీనిని 6 వ‌ర‌కు కుదించినా.. భ‌విష్య‌త్తులో మాత్రం ఖ‌చ్చితంగా ఈ విష‌యంలో ఎలాంటి వెనుక‌డుగు వేసే ప్ర‌స‌క్తి లేద‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ విజ‌న్‌.. బాబును మించి పోవ‌డం ఖాయ‌మ‌నేది వాస్త‌వం!

Read more RELATED
Recommended to you

Exit mobile version